రాష్ట్రీయం

కృష్ణానది పునర్జీవానికి తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: నాలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందిస్తున్న కృష్ణానది పునర్జీవనానికి తొలి అడుగు పడింది. కబ్జాలు, కాలుష్యాకారకాలతో నిండిపోతున్న కృష్ణానదిని సజీవంగా ఉంచుకుందాం అనే నినాదంతో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ, నేషనల్ వాటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలో ‘కృష్ణానది పునర్జీవనం’ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు. తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ.ప్రకాష్ అధ్యక్షతన జరిగిన జాతీయ సదస్సును రాష్ట్ర భారీనీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరొందిన రాజేంద్ర సింగ్, మంత్రి లక్ష్మారెడ్డి, ఐఇఎస్ సెక్రెటరీ రామేశ్వరరావు, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, మూసి రివర్ ఫ్రంట్ డవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ప్రేమ్‌సింగ్ రాథోడ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు నాలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు, నీటి వనరుల సంరక్షణకోసం పనిచేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. నాలుగు రాష్ట్రాల అవసరాలను తీర్చుతున్న కృష్ణానది నానాటికి అంతరించి పోయే స్థితికి చేరుకోవడం ఆవేదన కలిగించే అంశం అన్నారు. జాతీయ స్థాయిలో జల విధానం లేక పోవడంతో ఎంతో విలువైన నదీ జలాలు వృథాగా పోతున్నాయని అన్నారు. జల వనరులను సంరక్షించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పడిన వెనువెంటనే మిషన్ కాకతీయ పేరుతో చెరువల పునఃరుద్దరణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ క్రింద పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నట్టు చెప్పారు. నది జలాలలను వృదాగా సముద్రంగా కలిసిపోకుండా నదుల భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలిపారు. కేవలం నీటి పారుదల ప్రాజెక్టుల కోసమే తమ ప్రభుత్వం రూ. 25వేల కోట్లను కేటాయించిందని చెప్పారు. దేశంలో నాల్గొవ అది పెద్ద నదిగా కీర్తి గడించిన కృష్ణానదిలో ప్రస్తుతం కేవలం రెండు నెలలు మాత్రమే నీటి లభ్యత ఉంటుందని, అనంతరం నీరు లేక ఇసుక మేటలతో దర్శనమివ్వడం విచారకరమన్నారు. మహారాష్ట్ర జల విద్యుత్ కోసం 100 టీఎంసీల నీటిని సముద్రంలో కలిపేస్తోందని, ఆ నీటిని తిరిగి నదిలో ప్రవేశించేలా చేస్తే మిగిలిన రాష్ట్రాల అవసరాలను తీర్చవచ్చునన్నారు. నీరు ఉన్న చోటే నాగరికత అభివృద్ధి సాధిస్తుందని, నీరు లేని ప్రాంతాలు కాలగర్భంలో కలిసి పోతాయని సింధూ నాగరికత మనకు తెలియజేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న నీటి వనరులను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరాన్ని సదస్సులో వక్తలు పిలుపు నిచ్చారు. ప్రతి రాష్ట్రంలో కృష్ణానది పరిరక్షణ కుటుంబాలను ఏర్పాటు చేసుకొని నదిని వేయ్యేళ్లపాటు సజీవంగా ఉంచేందుకు ముందుకు కదలాల్సిన అవసరం ఉందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కోరారు. ప్రతి రాష్ట్రంలో ఐదు గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలోని కార్పోరేట్ సంస్థలు, సివిల్ సొసైటీ, నదికి పట్టిన వ్యాధి నిర్ధారణ కోసం డయాగ్నోసిస్, చికిత్స గ్రూప్‌లుగా ఏర్పడి విధులు నిర్వహించడం ద్వారా అత్యంత వేగంగా ఫలితాలను రాబట్టవచ్చునని పేర్కొన్నారు.
నదుల భూములు కబ్జాల నుంచి నిరోధించేందుకు ‘నది భూమి నదికి.. నదీజలం అందరికీ’ అనే నినాదంతో ప్రజల్లో విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని సదస్సు తీర్మానించింది.
నదికి రక్షణ ఇసుక అని నదుల నుంచి ఇసుకను తరలించడాన్ని పూర్తిగా నిరోధించడాన్ని ప్రభుత్వంతోపాటు ప్రజలు అడ్డుకోవాలని కోరారు. కృష్ణానది పరిరక్షణకు తెలంగాణ నుంచి మొదటి అడుగు పడిందని, ఇక్కడి ప్రభుత్వ ప్రోత్సాహంతో మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి నదిని సజీవం చేసేందుకు పదేళ్ల ప్రణాళికతో ముందుకు సాగాలని సదస్సులో తీర్మానించినట్టు తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ. ప్రకాష్ తెలిపారు. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయి కార్యచరణను రూపొందించి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.