జాతీయ వార్తలు

కాశ్మీర్‌పై తెగబడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: జమ్ము-కశ్మీర్‌లో పెద్ద ఎత్తున దాడులకు దిగాలని, జైషే మహమ్మద్ (జెమ్) సంస్థను ఐఎస్‌ఐ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద చర్యలకోసం ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్‌ఐ) ప్రస్తుతం ఎక్కువగా జైషే మహమ్మద్‌పై ఆధారపడుతోందని అధికార్లు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్ము-కశ్మీర్‌లో మరింత బలోపేతం కావాలని జెమ్‌ను ఎప్పటికప్పుడు ఐఎస్‌ఐ కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జెమ్ ఎక్కువగా నియంత్రణ రేఖ వెంట తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. కానీ జమ్ము-కశ్మీర్‌లో మరింత పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలన్నది ఐఎస్‌ఐ అభిమతం. 2016లో పఠాన్‌కోట్ తరహా దాడులు నిర్వహించే సామర్థ్యం జెమ్‌కు ఉన్నదని ఐఎస్‌ఐ గట్టిగా నమ్ముతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జైషే అహమ్మద్ సంస్థ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నెలకొల్పడంతో ఇది నిర్ధారణ అయింది.
ఉగ్రవాదులకు వివిధ ఆయుధ వినియోగంపై ఈ శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నారు. అయితే తెహ్రిక్-ఇ- తాలిబన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కూడా ఈ శిక్షణా శిబిరాల్లో ఉన్నట్టు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. జమ్మూ-కశ్మీర్‌లో దాడులకు పాల్పడతామన్న హామీ తీసుకున్న తర్వాతనే ఐఎస్‌ఐ, పాక్‌లోని వివిధ జైళ్లలోని ఉగ్రవాదులను విడుదల చేస్తోంది. వీరంతా జైషే మహమ్మద్ బ్యానర్‌పై ఈ దాడులు చేపట్టాలని ఆదేశిస్తోంది. ఇదే సమయంలో భద్రతా బలగాలపై దాడులు చేయాలని కూడా వారికి నూరిపోస్తున్నారు.