రాష్ట్రీయం

ప్రజల కోసం.. ఎంతకైనా తెగిస్తాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మే 22:ప్రజల కన్నీళ్లు తుడవడానికి, ప్రజాసమస్యల పోరాటానికి జనసేన ఎంతకైనా తెగిస్తుందని, అవసరమైతే కత్తులైనా వాడతామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా, పలాస మున్సిపాలిటీలోని కాశీబుగ్గలో ప్రత్యేక హోదా సాధనకై కవాతు నిర్వహించి, కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో ప్రత్యేక రథంపై నుంచి ఆశేష జనవాహినిని ఉద్దేశించి ఉద్వేగభరితంగా మాట్లాడి ఉత్తరాంధ్ర తనకు అమ్మ వంటిదని వెల్లడించారు.
2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జాలు, గూండాగిరీ చూసి ఎంతో అనుభవజ్ఞులైన చంద్రబాబునాయుడు రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకుడిగా భావించి జనసేన ఆయనను సమర్థించిందన్నారు. టీడీపీ నేతలు జనసేన అండతోనే నేడు పదవులు అనుభవిస్తున్నారని, జనసేన లేకుంటే అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడేది కాదన్నారు. 2019 ఎన్నికలలో జనసేన విజయం సాధిస్తుందని, అందుకు మీరంతా ఓటర్లుగా నమోదు చేసుకొని జనసేన విజయానికి రథసారధులు కావాలన్నారు. జనసేన అధికారం కోసం కాదని, ప్రజల కన్నీళ్లు తుడవడానికి వస్తుందన్నారు.