రాష్ట్రీయం

అడుగంటిన శ్రీశైలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం జలాశయంలో 28 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మంగళవారం సాయంత్రం జలాశయం నీటిమట్టం 799.90 అడుగులకు చేరుకుంది. 28.93 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు 70 మెగావాట్ల సామర్థ్యంతో ఒక జనరేటర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం జలాశయం నుండి 3,999 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం ఆ నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. తెలంగాణ పరిధిలోని భూగర్భ కేంద్రంలో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి చేపట్టలేదు.
- ఆంధ్రభూమి, శ్రీశైలం టౌన్