ఆంధ్రప్రదేశ్‌

బాబు వల్లే రాష్ట్రానికి మొండిచెయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాష్ట్భ్రావృద్ధిని విస్మరించి స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయాలు నెరుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాల వలననే రైల్వే బడ్జెట్‌లో కేంద్రం మొండి చెయ్యి చూపించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యేలు కోనా రఘుపతి, మహమ్మద్ ముస్త్ఫా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా, నగర కన్వీనర్లు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. బొత్స మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 6 నెలల్లో రైల్వేజోన్ ప్రకటించాల్సి ఉండగా, రెండు సంవత్సరాలు గడుస్తున్నా దిక్కులేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే రాష్ట్భ్రావృద్ధి దృష్ట్యా మద్దతు ఇస్తామని వైసిపి ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని స్వయంగా జగన్ ప్రతిపక్ష నాయకుని హోదాలో వెళ్లి కలిస్తే బిజెపితో వియ్యం పొందేందుకు తహతహలాడుతుందంటూ సిఎం చంద్రబాబు విమర్శలు చేశాడన్నారు. సిఎం చంద్రబాబు రాజధాని శంకుస్థాపనకు వందల కోట్లు వ్యయం చేసి ప్రచారార్భాటంతో కార్యక్రమం చేస్తే దేశ ప్రధాని నరేంద్రమోదీ నీరు-మట్టి ఇచ్చి వెళ్లి పత్తా లేకుండా పోయారన్నారు. ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి చేసిన హడావిడి ఇలా మొండిచెయ్యికి కారణమైందన్నారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపిలు పార్లమెంట్‌లో చప్పట్ల ద్వారా ఆమోదం తెలపటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మాటల్లో అభివృద్ధి చూపిస్తున్న సిఎం చంద్రబాబు చేతల్లో ఒక్క గృహానికి శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం లేదు, పరిశ్రమలు రాలేదు, కేంద్రం సహకారం లేదు అయినప్పటికీ 15 శాతం అభివృద్ధి ఎలా సాధించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా బేరసారాలు సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగని వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మరి కొంతమందిపై బెరింపులకు దిగుతున్నారన్నారు. తన 25 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడు ఇటువంటి రాజకీయాలు చూడలేదన్నారు. వైసిపిలోకి ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో జగన్ రాజీనామా చేసి రావాలని కోరారన్నారు. చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మరలా గెలిపించుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక శాతం ఓటుతో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కొనసాగిస్తున్న పాలన చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు.