రాష్ట్రీయం

ఆటో-కంటైనర్ ఢీ.. ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, మే 23: జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా నందిగామ పట్టణ శివారు అనాసాగరం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం- ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుండి చందర్లపాడు మండలం పోపూరు వద్ద ఒక కార్యక్రమం నిమిత్తం ఆటోలో వెళుతున్న వ్యక్తులు నందిగామ వద్ద బైపాస్ రోడ్డులో రాంగ్‌రూట్‌లో వెళుతుండగా విజయవాడ వైపు నుండి హైదరాబాదు వైపు వెళుతున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గుడిపాటి వెంకటేశ్వర్లు (57) షేక్ లాల్‌మియా(55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గుడిమెట్ల వెంకటేశ్వర్లు (46), గుడిమెట్ల శ్రీను, ఆటో డ్రైవర్ కె వెంకటేశ్వర్లులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గుడిమెట్ల వెంకటేశ్వర్లు (46) మృతి చెందాడు. ఎస్‌ఐ సురేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.