రాష్ట్రీయం

కేంద్రంలో చక్రం తిప్పేది టీడీపీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: వచ్చే పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ అనంతరం కేంద్రంలో ప్రధాన మంత్రిని నిర్ణయించేది, అక్కడ చ క్రం తిప్పేది టీడీపీయేనని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గు రువారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్మాటు చేసిన టీటీడీపీ మహానాడు సభ కు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు ప్రజల కు నమ్మక ద్రోహం చేసిందన్నారు. తీవ్రం గా దుయ్యబట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పొత్తు ఉం టుందని, అదే తెలంగాణలో పొత్తు లేదని చెప్పడం విడ్డూరంగా లేదా అంటూ ఆయ న ప్రశ్నించారు. మిత్రభేదం విడనాడి తమ ను శత్రువులుగా బిజెపి నేతలు చూస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కేంద్రంలో రాజకీయ మార్పుకు నాంది పలుకుతుందని ఆయన జ్యోసం చెప్పారు. న్యాయం జరిగేవరకు తాను పోరాటం చేస్తానని పరోక్షంగా ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాన మంత్రి తెలుగుప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. బీజేపీ చెప్పేవన్ని అబద్దాలేనని ఆయన నొక్కిచెప్పారు. ప్రధాన మం త్రి నరేంద్రమోదీ అవినీతిని ప్రక్షాళన చేస్తారని దేశ ప్రజలు ఎదురుచూశారని, కాని అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందన్నా రు. బ్యాంకులు దివాల తీయడానకి ప్రధాని చర్యలే కారనమని, అలాగే ఏటీఎంలలో డబ్బులు లేవని దీనికి కార ణం ప్రధానమంత్రేనన్నారు. బ్యాంకుల్లో తమ డబ్బులు దాచుకుందామన్న నమ్మకం ప్రజల్లో లేదన్నారు. జీఎస్‌టీ విధానంలో మార్పులు తీసుకురావాలని తమ పార్టీ ప్రధాని దృష్టికి వచ్చిందని, అయితే తమ మాటలను పట్టించుకోలేదన్నారు. జీఎస్‌టీలో స్లాబ్‌ల విధా నం అమలు చేస్తే అన్ని రంగాలకు మేలు జరుగుతుందని తమ పార్టీ సూచించిందని ఆయన పేర్కొన్నారు. ముస్లింలకు తలాక్ తీసుకువచ్చారని అయితే చట్టాలు చేయలేదన్నారు. ఏపీకీ ప్రత్యేక హాదా ఇస్తామని చెప్పి దెబ్బతీశారని ఆయన ధ్వజమెత్తారు. అందుకే తాము కేంద్రం మంత్రి పదవుల నుంచి వైదొలిగామని స్పష్టం చేశారు. ప్ర త్యేక హాదా కోసం తాము కేంద్రంపై అవిశ్వాసం పెట్టామని, తమను చూచి ఇతర పార్టీలు కూడా అవిశ్వానికి మద్దతిచ్చాయని చెప్పారు. తమకు జరిగిన అన్యాయాన్ని తెలియచెప్పడానికి కర్నాటకలో బీజేపీని ఓడించాలని, అందుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కన్నడ ప్రజలకు సూచించినట్లు చెప్పారు. 1996లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా హెచ్‌డీ దేవెగౌడ వ్యవహరించేవారని, నాటి సన్నిహితంతోనే కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్లినట్లు చెప్పారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి తన కేసులను తొలగించుకోవడానికి బీజేపీకి మద్దతిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో తెలుగు వారు ఉద్యోగాలు చేస్తున్నారంటే తాను ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంతో నేడు హైదరాబాద్‌కు పేరు వచ్చిందన్నారు. దేశంలో నంబర్ వన్, టుగా తెలుగు రాష్ట్రాలను తీ ర్చిదిద్దుతానన్నారు. గవర్నర్ వ్యవస్థలను తొలగించాలని తాము పట్టుపట్టామని అయితే అందుకు కేంద్రం ముందుకు రావడంలేదన్నారు. 1984లో బీజేపీకి కేవలం రెండు పార్లమెంట్ సీట్లు దక్కాయని, ఆ సమయంలో తమ పార్టీకి 34 పార్లమెంట్ సీట్లు దక్కాయని ఈ విషయాలను బీజేపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కేంద్రం నిధులు ఖర్చు చేస్తుందని మండిపడ్డారు.