ఆంధ్రప్రదేశ్‌

లేపాక్షి శిల్పకళల ధర్మవరం పట్టుచీర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం: లేపాక్షిలో జరుగనున్న నంది ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ధర్మవరం పట్టణానికి చెందిన డిజైనర్ జుజారు నాగరాజు 35 రకాల శిల్పకళలను ధర్మవరం పట్టుచీరలో ఒదిగేలా చేసి పలువురి మన్ననలు పొందారు. ఈ చీరలో నందీశ్వరుడు, ఏడుతలల శివలింగం, జఠాయువు, రాజు, ఏనుగు, నెమలి బొమ్మలను అందంగా ఇమిడ్చి కొత్త సొబగులు అద్దాడు. గురువారం ధర్మవరం పట్టణంలోని తొగటవీధిలోని తన ఇంట్లో ఈ చీరను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ 2004లో తిరుపతి వెంకన్న శంఖుచక్రాలు ఉన్న పట్టుచీర తయారు చేసి సాంబ సినిమాలో జూనియర్ ఎన్‌టిఆర్‌చే ఆవిష్కరింపజేసినట్లు తెలిపారు. 2006లో తాజ్‌మహల్ దృశ్యాలతో చీర డిజైన్ చేశానన్నారు. తాజాగా లేపాక్షి శిల్పకళలను జోడించి చీర నేశానన్నారు. కుటుంబ సభ్యులు, సహచర నేత కార్మికుల సహకారంతో 20 రోజుల్లో చీర పూర్తిచేశానన్నారు. దీని ధర రూ.50 వేలని వివరించాడు. భవిష్యత్తులో మరిన్ని కొత్తడిజైన్లతో పట్టుచీరలు తయారుచేసి ఉత్తమ డిజైనర్‌గా ప్రభుత్వం అవార్డు పొందాలన్నదే తన ఆశయమన్నారు.