రాష్ట్రీయం

ముందు ఎంపీడీవోలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మండలాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న మండల పరిషత్తు అభివృద్ధి అధికారులను (ఎంపీడీఓ) మొదటిదశలో బదిలీ చేయాలని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది బదీలకు సంబంధించి సంబధిత ఉన్నతాధికారులను ఆదేశిస్తూ, గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బదిలీల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఉంటే వారిని ఇప్పట్లో బదిలీ చేయవద్దని, ఎన్నికల తర్వాత వారి బదిలీలు చేపట్టాలని సూచించారు. రూర్బన్ (రూరల్-అర్భన్ మిషన్) పథకంలో 150 కోట్లతో 349 గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నామని మంత్రి తెలిపారు. సకాలంలో రూర్బన్ పనులు పూర్తయితే కేంద్రం నుండి అదనపు నిధులు లభిస్తాయని మంత్రి తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం సక్రమంగా కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. 50 రోజుల కన్నా ఎక్కువ పనిదినాలు కల్పించే సిబ్బందికి ప్రోత్సాహం ఇస్తామని, రాష్ట్రం సగటుకన్నా తక్కువ పనిదినాలు కల్పించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.