ఆంధ్రప్రదేశ్‌

ఆదాయం ప్రధానం కాదు! ఇసుకను అందుబాటులో ఉంచడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ప్రభుత్వానికి ఇసుక మీద వచ్చే ఆదాయం ప్రధానం కాదని, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఇసుక లభించటమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాపు రుణమేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు వచ్చిన ఆయన తిరిగివెళుతున్న సమయంలో స్ధానిక సర్ సిఆర్‌ఆర్ మైదానంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద జిల్లాలోని ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక అంశాన్ని ప్రస్తావించారు. సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని, ఇళ్లు కట్టుకునే అవకాశం కూడా లేక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఇసుకపై ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా ఫర్వాలేదని, సామాన్యులకు అందుబాటులో ఉండటమే లక్ష్యమని స్పష్టంచేశారు. అయితే దీనికి సంబంధించి విధివిధానాలపై కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. జిల్లాకు సంబంధించి ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎటువంటి విధానం అవలంభిస్తే సామాన్యులకు మేలు జరుగుతుంది అన్న విషయంలో జిల్లా కలెక్టరు, ఎమ్మెల్యేలు కసరత్తుచేసి వారంలో తనకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. విజయవాడకు వారంలో ప్రతిపాదనలతో తనను కలవాలని కలెక్టరుకు సూచించినట్లు సమాచారం.
మద్యం దుకాణాల లైసెన్సుల తరహాలో...
జిల్లాల్లో ఇసుక టెండర్లకు సంబంధించి వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం ఈ టెండర్ల విషయంలో ఎక్సైజ్ విభాగంలో అనుసరించిన విధానం ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగానే ఇసుక క్యూబిక్ మీటర్‌కు ఎంత ఖర్చు అవుతుంది అన్న అంశాన్ని ఖరారు చేసి, దాని ఆధారంగా ఇసుక టెండర్లను ఆహ్వానించి లాటరీ ద్వారా ఖరారు చేయాలన్న నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం.
దీనిపై ఇప్పటికే అభిప్రాయాలు సేకరించి వాటికనుగుణంగా కసరత్తుచేస్తునట్లు తెలుస్తోంది.