రాష్ట్రీయం

హైదరాబాద్‌లో హెలికాప్టర్ అంబులెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: హైదరాబాద్‌లో హెలికాప్టర్ అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారం ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. వింగ్స్ ఏవియేషన్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. ప్రభాకర్‌రెడ్డి శనివారం ఇక్కడ (నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్) మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశంలో మొదటిసారి హెలికాప్టర్ అంబులెన్స్‌ను ప్రారంభించిన ఘనత తెలంగాణకే దక్కుతోందన్నారు. ఎక్కడైనా ఎవరికైనా అత్యవసర వైద్య సేవలు అందించాలంటే తమ హెలికాప్టర్ అంబులెన్స్‌ను ఉపయోగించుకోవచ్చన్నారు. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ 109 పేరుతో ఉపయోగిస్తున్న హెలికాప్టర్‌ను ఇందుకోసం వాడుతున్నామన్నారు. ప్రత్యేకంగా హెలిప్యాడ్ లేకపోయినా, హెలికాప్టర్ దిగేంత స్థలం ఉంటే తమ హెలికాప్టర్ దిగుతుందని, అత్యవసర సమయంలో రోగులకోసం దీన్ని పంపిస్తామన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా గాయపడి, గుండెపోటు లేదా ఇతర ప్రమాదకరమైన అనారోగ్యానికి గురైతే చికిత్స అందించే ఏర్పాట్లు ఉన్నాయన్నారు. హెలికాప్టర్ అంబులెన్స్‌లో ఈసీజీతోసహా అనేక అధునాతన డయాగ్నసిస్ సౌకర్యాలు ఉన్నాయన్నారు. రోగిని 450 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ఆసుపత్రికి తరలించేందుకు ఒకలక్షా యాభైవేల రూపాయలు చార్జీ చేస్తామని ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఒకే హెలికాప్టర్‌ను ప్రారంభించామని, మరో మూడు నెలల్లో అదనంగా ఆరు అంబులెన్స్ హెలికాప్టర్లు సిద్ధం చేస్తామన్నారు. తాజాగా ప్రారంభించిన హెలికాప్టర్ అంబులెన్స్ సేవలు తెలంగాణతోపాటు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటకలకు కూడా ఉపయోగపడుతుందన్నారు. త్వరలోనే బెంగళూరు, ముంబాయి, కొచ్చిన్ తదితర నగరాల్లో కూడా హెలికాప్టర్ అంబులెన్స్‌ల కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. హెలీకాప్టర్ అంబులెన్స్ సేవల కోసం ఫోన్‌నెంబర్ 87906 15910 లేదా టోల్‌ఫ్రీ నెంబర్ 1800 258 7080 నెంబర్లకు సంప్రదించాల్సి ఉంటుందని ప్రభాకర్‌రెడ్డి వివరించారు.