రాష్ట్రీయం

ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: చింతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 26: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 175 అసెంబ్లీ, 25పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. నాలుగు సంవత్సరాల బీజేపీ పాలనను నిరసిస్తూ శనివారం తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ దొందూదొందేనని, వీరు రాష్ట్భ్రావృద్ధిని కోరుకునే వ్యక్తులు కాదని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. నాలుగేళ్ల బీజేపీ ప్రభుత్వంలో దేశంలో అభివృద్ధి శూన్యమయ్యిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని పేర్కొన్నారు. మోదీ నిర్ణయాలతో బ్యాంకింగ్ రంగం కుదేలయ్యిందన్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తానన్న హామీ మోదీ బుట్టదాఖలు చేశారన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ రాజకీయ విరోధులేనన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన ఆన్నారు.