ఆంధ్రప్రదేశ్‌

విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యం: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25 : 2016-17 సంవత్సరానికి విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీఠ వేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలపై గురువారం ఆయన మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, పి. నారాయణ, కిమిడి మృణాళిని, రావెల కిషోర్‌బాబు తదితరులతో చర్చించారు.
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, 501 మంది డాక్టర్లు, 1000 మంది నర్సులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తామన్నారు. వైద్యం, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో భారతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ చార్జీలను 10 శాతం పెంచాలని సూత్రప్రాయంగా అంగీకరించామని వెల్లడించారు.
2016-17 సంవత్సరం పూర్తయ్యేవరకు అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తామన్నారు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు.