ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగులు తరలివెళ్లేందుకు మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎపి రాష్ట్ర ఉద్యోగులను విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి పి. నారాయణ తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని, 2016 జూన్ 15 లోగా సచివాలయంతో పాటు హెచ్‌ఓడి కార్యాలయాలను తరలిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు విజయవాడ తరలివెళ్లేందుకు మార్గం సుగమమైందని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలనేతలు ప్రస్తావించిన సమస్యల్లో ‘స్థానికత’ ప్రధానమైందని నారాయణ తెలిపారు. ఉద్యోగుల పిల్లల చదువుకు సంబంధించి స్థానికత అడ్డురాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై కేంద్రం నుండి ఉత్తర్వులు రావలసి ఉందని, అందువల్ల కేంద్రంతో చర్చించేందుకు ఉన్నతాధికారులను ఢిల్లీ పంపిస్తామన్నారు. ఉద్యోగులు పేర్కొంటున్న హెచ్‌ఆర్‌ఎ తదితర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విజయవాడ తరలివెళ్లిన తర్వాత వారానికి ఐదురోజుల పనివిధానాన్ని కొంతకాలం ప్రవేశపెట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తామని చెప్పారు.

ఆర్థిక సంఘం
నిధులకు ఆడిట్ ముడి

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీలకు పెర్‌ఫార్మెన్స్ నిధులను కేటాయించేందుకు ఆడిట్ తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలోని సగానికి పైగా మున్సిపాల్టీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఆడిట్ పూర్తిగాకుండా నిధులు దక్కించుకోవడం ఎలా అని తలలు పట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో 2014-15 సంవత్సరానికి సంబంధించి ఆడిట్ పూర్తి చేసుకున్న మున్సిపాల్టీలకు మాత్రమే ఈ నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత నాలుగేళ్లుగా ఆడిట్ పూర్తి కాని మున్సిపాల్టీలు అయోమయంలో పడ్డాయి. ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటున్న మున్సిపాల్టీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు ఆడిట్ ముడిపెట్టడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. మార్చిలోగా ఆడిట్ పూర్తి చేసుకున్న మున్సిపాల్టీలకు ఈ నిధులు మంజూరు చేయనున్నారు.