క్రైమ్/లీగల్

తల్లికి కొరివి పెట్టేందుకు వెళ్తూ... కొడుకు మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జూన్ 4: తల్లికి తలకొరివి పెట్టేందుకు బయలుదేరిన కొడుకు, అతని మరదలు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా భార్య, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. 65వ నెంబరు జాతీయరహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ సమీపంలో సోమవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ గ్రామీణ ఎస్‌ఐ విజయ ప్రకాష్ వివరాల మేరకు.. కొమరబండ బైపాస్ వద్ద ఆగివున్న లారీని వెనుకనుండి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ఆదివారం రాత్రి మృతిచెందిన తన తల్లి అంత్యక్రియల కొరకు హైద్రాబాద్ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అరిమెల్ల వెంకట సత్యనారాయణ (32) భార్య వెంకట సౌజన్య (25), గుళ్లపల్లి వెంకట మాధవి (21)లతో కలిసి అద్దె కారులో బయలుదేరాడు. కోదాడ మండలం కొమరబండ బైపాస్ వద్దకు వచ్చేసరికి కారు లారీని వెనుకనుండి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వెంకట సత్యనారాయణ (32), ఆయన మరదలు వెంకట మాధవి (21) అక్కడికక్కడే మృతిచెందారు. సత్యనారాయణ భార్య వెంకట సౌజన్య (25), కారు డ్రైవర్ కె.రాజేష్ తీవ్రగాయాలకు గురికావడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమచికిత్స చేశారు. తదుపరి మెరుగైన చికిత్స కొరకు సౌజన్యను విజయవాడ, రాజేష్‌ను హైద్రాబాద్ హాస్పిటల్స్‌కు తరలించారు. మృతుడి బంధువులు రావులపాలెం నుండి కోదాడకు చేరుకొని పోస్ట్‌మార్టం తదుపరి మృతదేహాలను స్వాధీనం చేసుకొని తీసుకెళ్లారు. కోదాడ గ్రామీణ ఎస్‌ఐ విజయ్‌ప్రకాష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.