రాష్ట్రీయం

జానా ఇటు... భట్టి అటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలల వ్యవధి మాత్రమే ఉండడంతో, తెలంగాణలో పార్టీని మరింత పటిష్టంగా, సమర్థంగా ముందుకు నడిపించేందుకు టీ.పీపీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ‘పావులు’ కదుపుతున్నారు. ఈ నెలాఖరులోగా భారీగా మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఎఐసిసి ముఖ్య నాయకులతో ఉత్తమ్ మంతనాలు జరిపారు. తాను చేయాలనుకుంటున్న మార్పుల గురించి ఎఐసిసి నాయకులు అశోక్ గెహ్లట్, అహ్మద్ పటేల్, కొప్పుల రాజు, సూర్జీవాలా ప్రభృతుల ముం దు ప్రతిపాదనలు ఉంచారు. ఉత్తమ్ కుమార్ ప్రతిపాదనల పట్ల వారు సానుకూలంగా స్పందించారు. అయితే దీనికి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. టీ.పీసీసీ, సీఎల్‌పీ కమిటీల్లో మార్పులు చేయాలని, పార్టీ సమన్వయ కమిటీ, ఎన్నికల ప్రచార కమిటీ, ఎన్నికల ప్రణాళిక కమిటీలకు ఎవరెవరు ఉండాలన్న ప్రతిపాదనలతో ఉత్తమ్ ఢిల్లీ వెళ్ళారు. ప్రతి కమిటీలోనూ అన్ని కులాలకు గౌరవ ప్రదమైన స్థానం కల్పించాలని, మహిళలకూ గుర్తింపునివ్వాలని ఆయన భావిస్తున్నారు.
సీఎల్‌పీ నేతగా విక్రమార్క!
టీ.పీసీసీ అధ్యక్షుడు, సిఎల్‌పి నేత ఇరువురూ ‘రెడ్డి’ సామాజికవర్గానికి చెందిన వారే ఉండడం వల్ల కొంత విమర్శను ఎదుర్కొవాల్సి వస్తున్నదని ఉత్తమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. పైగా అసెంబ్లీలో కొన్ని సందర్భాల్లో జానారెడ్డి గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని, ‘పెద్దలు జానారెడ్డిగారూ..’ అని ముఖ్యమంత్రి సంభోదించడంతోనే ఆయన మెత్తబడిపోతున్నారన్న విమర్శ లేకపోలేదు. టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కను సీఎల్‌పీ నేతగా నియమిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. దళితుడిని సీఎల్‌పీ నేతగా నియమిస్తే, అధికార పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడలేదని ఉత్తమ్ ఎత్తుగడ. ఏదైనా అనరాని మాటలు అంటే దళితుడిని అవమానించారంటూ నిలదీయడానికి ఉపయోగపడుతుందని, పైగా దళిత ఎమ్మెల్యేకు గుర్తింపునిచ్చినట్లు అవుతుందని ఆయన భావన.
జానారెడ్డి అంగీకరిస్తారా?
ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎల్‌పీ నాయకుడు కె. జానారెడ్డి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? అనే అనుమానాలూ లేకపోలేదు. సీనియర్ నాయకుడు, వివిధ మంత్రి పదవులు నిర్వహించి, అపారమైన అనుభవం ఉన్న జానారెడ్డిని సిఎల్‌పి నేత బాధ్యత నుంచి ఎలా తప్పిస్తారన్న ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. అయితే జానారెడ్డి సేవలను పార్టీకి ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవాలని ఉత్తమ్ భావిస్తున్నారు. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతను పూర్తిగా అప్పగించాలని ఉత్తమ్ ఆలోచనగా కనిపిస్తున్నది. పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీలోనూ ప్రాధాన్యతనివ్వాలనుకుంటున్నట్లు సమాచారం. పార్టీలో సీనియర్ నాయకులందరికీ బాధ్యతలు అప్పగించాలని, పార్టీ సమన్వయ కమిటీనీ మరింత పటిష్టవంతం చేయాలని, పార్టీ అనుబంధ విభాగాలను చురుగ్గా పని చేయిస్తూ, ఆ విభాగాల సేవలనూ ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా పెట్టుకోవాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.