రాష్ట్రీయం

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జూన్ 17: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. భక్తుల కోర్కెలు తీర్చే భక్తవత్సలుడు.. శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థమై వచ్చిన భక్తులతో యాదాద్రి కొండ జనసంద్రంగా మారిపోయింది. ఈ దేవాలయానికి విలీన దేవాలయమైన శ్రీపాత లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కూడా భక్తులతో పోటెత్తింది. రెండు ఆలయాల్లో దేవుడు ఒక్కడే. అయినా ఆలయాలు వేర్వేరు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు భక్తులతో ఆదివారం భక్తజన సంద్రంగా మారిపోయింది. రెండు రోజులు వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. యాదగిరి కొండపై పుష్కరిణిలో సరిగ్గా నీరు లేకపోవడంతో స్నానమాచరించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. ధర్మ దర్శనానికి మూడు గంటలు, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి నాలుగు గంటలు, ప్రసాద విక్రయ కౌంటర్ల వద్ద గంటకు పైగా సమయం పట్టింది. భక్తులు కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేక అవస్థలు పడ్డారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో స్వామివారి దర్శనం లభించదేమోనని భావించిన భక్తులు గుట్టకు మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీపాత లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా భక్తుల సంఖ్య ఇదే రీతిలో ఉండటంతో భక్తులు ప్రైవేటు స్థలాలు, చెట్ల కింద సేద తీరారు. యాదగిరి కొండపై దర్శనం లభించదని భావించిన భక్తులు ఆలయం బయట నుండే స్వామివారిని మొక్కి వెనుదిరిగారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థాన అధికారులు భక్తులకు లఘు దర్శన సౌకర్యం కల్పించారు. కొండపైకి పోలీసులు వాహనాలను అనుమతించకపోవడంతో కొంతమంది వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండ కింద, కొండపైన గల వ్యాపారాలు జోరుగా జరగడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెలవుదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కావున దేవస్థాన అధికారులు తగిన వసతులు కల్పించాలని భక్తులు కోరుకుంటున్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఒకరోజు ఆదాయం రూ.36 లక్షల 77, 645లు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.లక్షా 71,382, అతి శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా రూ.45,100, వీఐపీ దర్శనం టికెట్ల ద్వారా రూ.11లక్షల 14,950, వ్రతాల టికెట్ల ద్వారా రూ.లక్షా 77వేలు, కల్యాణకట్ట ద్వారా రూ.82వేలు, విచారణశ ఖ ద్వారా రూ.లక్షా 15,770, స్వామివారి ప్రసాద విక్రయాల ద్వారా రూ.14లక్షల 45వేల 100, టోల్‌గేటు ద్వారా రూ.3వేల 740, సహస్ర పూజా టికెట్ల ద్వారా రూ.10,116, అన్నప్రసాద విక్రయాల ద్వారా రూ.60వేల 928, వాహన పూజల ద్వారా రూ.46వేల 700 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
చిత్రం..యాదాద్రిలో ఆదివారం లక్ష్మీ నారసింహ స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు