ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర విభజనానంతరం ఆర్థిక సంక్షోభంతో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతున్నప్పటికీ గడచిన రెండేళ్లలో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే, వ్యవసాయ రంగానికి ముందెన్నడూ లేని విధంగా పెద్దపీట వేశామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు సగర్వంగా చెప్పారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌తో పాటు రైతు సాధికారత సంస్థ, పొలం పిలుస్తోంది, ప్రైమరీ సెక్టార్ మిషన్ తదితర వినూత్న కార్యక్రమాలు చేపట్టామని, నదుల అనుసంధానం ద్వారా దేశంలో చరిత్ర సృష్టించామన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తి కావాల్సి ఉన్నా ముందుగా కేవలం ఐదు నెలల్లోనే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 8 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణాకు తీసుకొచ్చి ఇక్కడ పంటలు కాపాడగలిగామని, రాబోయే కాలంలో 80 టిఎంసిలు గోదావరి నుంచి కృష్ణకు మళ్లించి రాయలసీమను సశ్యశ్యామలం చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తొలి ఏడాది ఉన్న రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటును కేంద్రం పూర్తిగా భరించాల్సి ఉన్నా నామమాత్రంగా నిధులు సమకూరాయన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదాగా ప్రకటించిన ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తికి సరిపడ నిధులు కేటాయించకపోగా, ఇప్పటివరకు ఖర్చు చేసిన 3,500 కోట్లు కూడా జమ చేయకుండా ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించటం దారుణమన్నారు. తాను అనేకమార్లు ప్రధానమంత్రి మోదీని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి వివరించినా ఆశించినమేర బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు. ఏడు వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంశాల ప్రస్తావనే లేదన్నారు. విద్యా సంస్థలకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవన్నారు. ఈ విషయంపై తాను నేటి ఉదయం కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో మాట్లాడగా బడ్జెట్ కేటాయింపులు శాఖాపరంగా జరిగాయి గాని రాష్ట్రాలవారీ కాదని, ఎపికి కలిగే ప్రయోజనాలపై త్వరలో స్పష్టత ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసేందుకు కేంద్రంపై పోరాడి గెలుచుకోగలిగామన్నారు.
మనది పొలిటికల్ గవర్నెన్స్, మరో మూడేళ్లలో మళ్లీ ప్రజా తీర్పు కోసం వెళ్లాల్సి ఉన్నందున ఇప్పటి నుంచే ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలన్నారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేసి వచ్చే ఎన్నికలు వన్ సైడ్‌గా జరిగేలా చూస్తారన్న నమ్మకం నాయకులు, కార్యకర్తలపై తనకున్నదన్నారు. మంగళవారం నాడిక్కడ జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలు వివరించారు. గోదావరి జలాల తరలింపు కోసం జర్మనీ నుంచి యంత్రాలు రప్పించామన్నారు. వర్షాభావ ప్రాంతాల్లో రెయిన్ గన్‌ల ద్వారా రోజుకు లక్ష ఎకరాల చొప్పున 40 లక్షల ఎకరాలకు నీరందించి మెట్ట పైర్లను కాపాడాలనే ధ్యేయంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిజియోమీటర్లు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ ద్వారా భూగర్భ జలమట్టం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. వృద్ధి రేటు జాతీయంగా 7.5 శాతం ఉంటే ఆంధ్రలో 10.5 శాతం సాధించామన్నారు. రాష్ట్రంలో ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా, అక్రమ తవ్వకాలు జరగకుండా బందోబస్తు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఇసుకను నిత్యావసర వస్తువుల చట్ట పరిధిలోకి తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడేవారిపై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు స్టేపై కొనసాగుతోందని ఈ అంశం త్వరలో విచారణకు రానున్నందున దీనిపై ఐదుగురు ముస్లిం ప్రముఖులు ఢిల్లీ వెళ్లి దానిపై వాదించేందుకు సమర్థుడైన న్యాయవాదిని ఎంపిక చేసుకోవాలని, ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కాపులను శాస్ర్తియ పద్ధతిలో బిసిల జాబితాలో చేర్చేందుకు కమిషన్ నియమించగా ఓర్వలేని కొంతమంది అరాచకవాదులు రైలు కాల్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఇందులో అమాయకులను శిక్షించేది లేదు, దోషులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.