రాష్ట్రీయం

‘నీట్’ నిర్లక్ష్యం మెరిట్‌కు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: నీట్ కౌనె్సలింగ్‌లో తప్పిదాలు మెరిట్ అభ్యర్థులకు శాపంగా పరిణమిస్తున్నాయి. వెబ్ కౌనె్సలింగ్‌లో వైద్య కళాశాలల జాబితాలో ప్రముఖ వైద్య కళాశాలలు కనిపించకుండా చేశారు. దీంతో అఖిల భారత స్థాయిలో మెరిట్ విద్యార్థులకు సీట్లు దక్కకుండా పోయాయి. మొదటి కౌనె్సలింగ్‌లో అవకాశం లేకపోయినా, రెండో కౌనె్సలింగ్‌లో చూద్దాంలెండి అంటూ హెల్త్ యూనివర్శిటీల వైస్‌ఛాన్స్‌లర్స్ చెప్పి, చేతులు దులుపుకొన్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే, ఆల్ ఇండియా పూల్‌లో ఉన్న సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించాల్సి ఉంది. కానీ వెబ్‌సైట్‌లో కేవలం 6.3 శాతం రిజర్వేషన్ మాత్రమే కనిపిస్తోంది. దీనివలన అఖిల భారత స్థాయిలో సుమారు 830 మంది ఓబీసీ విద్యార్థులు రిజర్వేషన్లను కోల్పోనున్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ తప్పిదాన్ని ఏ ప్రభుత్వమూ గుర్తించకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోని అన్ని మెడికల్ కళాశాలల నుంచి ఆయా నిష్పత్తులను బట్టి కొన్ని సీట్లను ఆల్ ఇండియా పూల్ కోటాకు వదిలేయాల్సి ఉంటుంది. ఇలా ఆల్ ఇండియా పూల్‌లో 3,300 సీట్లు ఉన్నాయి. వీటిలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న స్పష్టమైన నిబంధన ఉంది. అంటే సుమారు 830 సీట్లు ఓబీసీలకు రావల్సి ఉంది. కానీ ప్రస్తుతం వెబ్‌సైట్‌లో కేవలం 64 సీట్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
అంటే, 6.3 శాతం రిజర్వేషన్ మాత్రమే ఓబీసీలకు దక్కుతోందన్నమాట. ఇది పొరపాటా? ఓ పథకం ప్రకారం రిజర్వేషన్‌ను తగ్గించారా? లేక దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అన్నది అర్థం కావడం లేదు. ఈ విషయమై ఎంపీసీ, డైరక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ అధికారులను అడిగినా, ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో ఓబీసీ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోపోవడం శోచనీయం.
మనకు మనమే పోటీ!
ఇదిలా ఉండగా నీట్ కౌనె్సలింగ్‌లో జరుగుతున్న అవకతవకల వలన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిపోతోంది. ఆల్ ఇండియా పూల్‌లోకి తెలంగాణ నుంచి 180 సీట్లు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 283 సీట్లు వెళ్లాయి. అయితే, ప్రస్తుతం వెబ్ ఆప్షన్‌లో తెలంగాణకు సంబంధించి 150 సీట్లు మాత్రమే మిస్ అయ్యాయి. ఒకవేళ ఈ సీట్లు ఆల్ ఇండియా పూల్‌లో ఉండి ఉంటే, ఈ సీట్లలో చాలా సీట్లు ఏపీ అభ్యర్థులకే దక్కేవి. కానీ వెబ్‌సైట్‌లో కాలేజీలు లేకపోవడంతో ఏపీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోయారు. వీరంతా ఆల్ ఇండియా పూల్ కోటాలో ఉన్న సీట్లను దక్కించుకుని ఉంటే, రాష్టస్థ్రాయిలో జరిగే కౌనె్సలింగ్‌లో పాల్గొనరు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో త్వరలో జరగనున్న రాష్టస్థ్రాయి కౌన్సిలింగ్‌లో మెరిట్ అభ్యర్థులు సీట్ల కోసం పోటీ పడతారు. దాంతో సీటు దక్కించుకోడానికి కొద్దిపాటి అవకాశం ఉన్న అభ్యర్థులు సీట్లను కోల్పోవలసి ఉంటుంది. అలాగే, మంచి ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు ఆల్ ఇండియా పూల్ కోటాలో సీటు దక్కించుకోలేకపోతున్నారు. ఏదో ఒక చోట సీటు సంపాదించి, సరిపెట్టుకోవలసి వస్తోంది.
ఆప్షన్ నమోదుకు సమయం పెంపు!
ఇదిలా ఉండగా వెబ్ ఆప్షన్ నమోదు సమయం మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. కానీ ఈ సమయాన్ని రాత్రి 11 గంటల వరకూ పొడిగిస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సా. 4.30 గంటలకు ప్రకటించడం వలన చాలా మంది అభ్యర్థులకు తెలియకుండాపోయింది. కాగా, వెబ్ ఆప్షన్‌లో జరిగిన అవకతవకలను సరిచేసి, కనీసం మరో మూడు రోజులపాటు ఆప్షన్స్ నమోదు సమయాన్ని పెంచాలని తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.