రాష్ట్రీయం

గంటా అలక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 20: టీడీపీలో మరో దూమారం లేచింది. మంగళవారం అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరుకాకపోవడం, విశాఖలోని తన నివాసంలోనే ఉండిపోవడం పార్టీలో కలకలం రేపింది. రాష్టస్థ్రాయిలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ‘దీని గురించి ఏమీ చెప్పను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా’నని మీడియాకు ఆయన స్పష్టం చేశారు. దీని వెనుక పార్టీ వర్గాల కథనం మరోలా ఉంది. మంత్రి గంటా శ్రీనివాసరావుప్రస్తుతం భీమిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు ఈ నియోజకవర్గానికి అవంతి శ్రీనివాసరావుప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో అవంతి శ్రీనివాసరావును అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించి, గంటాను భీమిలి నుంచి బరిలోకి దించారు. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. అయితే, వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాసరావు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఇష్టం లేదు. ఆయన తిరిగి భీమిలి నియోజకవర్గానికి వెళ్లాలని
నిర్ణయించుకున్నారు. కానీ, కొద్ది రోజుల కిందట గంటా శ్రీనివాసరావు ఒక సభలో మాట్లాడుతూ తాను తిరిగి భీమిలి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో అవంతి శ్రీనివాసరావు టీడీపీని వీడి, వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇది చంద్రబాబు దృష్టికి వెళ్లింది. అవంతిని వదులుకోవడం పార్టీకి ఇష్టం లేదు. అవంతి పార్టీని వీడి వెళ్లకుండా ఉండేందుకు భీమిలి నియోజకవర్గం నుంచే అవంతిని పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, భీమిలి నియోజకవర్గంలో గంటా ప్రతిష్ఠ దెబ్బతిందంటూ ఒక పత్రిక సర్వేలో వెల్లడించింది. గత కొద్ది రోజులుగా గంటాకు వ్యతిరేకంగా కథనాలు వెలువవడంతో ఆయన అసహనానికి గురైనట్టు తెలిసింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. ఈ విషయమై ఆయనన ప్రశ్నిస్తే, గతంలో కూడా తాను అనేకసార్లు క్యాబినెట్ సమావేశాలకు వెళ్లలేదని చెప్పారు. బుధవారం కూడా ఆయన తన ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన సన్నిహితులతో మంతనాలు సాగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారా? అని అడిగిన ప్రశ్నకు గంటా సమాధానాన్ని దాటవేశారు. గురువారం విశాఖలో జరగనున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలకు హాజరవుతారా? అని ప్రశ్నిస్తే, సీఎం వస్తున్నారా? అని ఎదురు ప్రశ్నించారు. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు గంటాను ఫోన్‌లో సంప్రదిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా మంత్రి గంటాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై వివరణ తీసుకునేందుకు అవంతి శ్రీనివాసరావు అందుబాటులో లేరు.