రాష్ట్రీయం

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 20: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ గత కొంతకాలంగా పోలీసుల దాడుల నుంచి తప్పించుకు తిరుగుతున్న అంతరాష్ట్ర స్మగ్లర్లను నెల్లూరు పోలీసులు మంగళవారం పట్టుకొని వారి వద్ద నుండి సుమారు 2.50కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా క్రైం ఓఎస్‌డి విఠలేశ్వర్ తెలియచేశారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. జిల్లాలోని వివిధ కోవూరు, బిట్రగుంట, గూడూరురూరల్, ఉదయగిరి, కలువాయి పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన వాహన తనిఖీల్లో ఐదు చోట్ల వాహనాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నిందితులను టాస్క్ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రస్తుతం గిద్దలూరు అటవీ రేంజ్‌లో బీట్ అధికారిగా పనిచేస్తున్న పేరం రామరాజు ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తూ, తరలింపులో తానే అన్నీ అయ్యి వ్యవహరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ప్రధాన అనుచరుడు బత్తల కిషోర్‌కుమార్, మైదుకూరుకు చెందిన మేస్ర్తి వనం చెన్నయ్య కూడా ఉన్నారు. అరెస్టయిన వారిలో కడప జిల్లాకు చెందిన వారు 8 మంది ఉన్నారు. ముగ్గురు తమిళనాడుకు చెందిన వారు కాగా, ఆరుగురు ప్రకాశం జిల్లాకు చెందిన వారుగా వెల్లడైంది. నిందితులను పట్టుకునే సమయంలో వారు పోలీసులపై ఎదురుదాడులకు దిగారు. వాహనాలతో పోలీసులను ఢీకొట్టి తప్పించుకునేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలను పోలీసులు చాకచక్యంగా తప్పించుకొని నిందితులను అదుపులోకి తీసుకోగలిగారు.