రాష్ట్రీయం

ఆరోగ్యమస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ (జగదాంబ): దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా నూతన ఆరోగ్య పథకాలను ఏర్పాటు చేస్తూ, పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలందిస్తున్న ఏపీలో తొలిసారిగా ఏపీ హెల్త్ ఫెస్టివల్-2018ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో ఆరోగ్య శాఖ సలహాదారుడు డాక్టర్ జితేంద్ర శర్మ, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో కలసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేస్తున్న నేపథ్యంలో వాటిపై మరింత ప్రచారం కల్పించడంతో పాటు, నూతన పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. మనమంతా పండగలు జరుపుకునే సమయాల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తుంటారని అటువంటి వారికి అంకితంగా హెల్త్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు, నీతి ఆయోగ్ సభ్యులు హాజరవుతున్నారన్నారు. హెల్త్ ఫెస్టివల్‌ను పురస్కరించుకొని ఈ నెల 21న ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐదు కొత్త ఆరోగ్య పథకాలకు శ్రీకారం చుట్టామని, వాటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. ఏజెన్సీ, మారుమాల గిరిజన గ్రామాల్లో సకాలంలో వైద్య సేవలందించేలా టెలీ కౌనె్సలింగ్ సెంటర్ల తరహాలో ఈ- సబ్ సెంటర్లు, హెల్త్ ఏటీఎంలు, అదనంగా 17 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, అంగన్‌వాడీ కేంద్రంలో విద్యనుభ్యసించే చిన్నారుల నుంచి కళాశాల విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 450 మొబైల్ వాహనాల ప్రారంభం, అప్పుడే పుట్టిన పసిబిడ్డను అన్ని విధాలుగా కాపాడడంతో పాటు, వారిని ఎవరూ అపహరించకుండా నియంత్రించేందుకు ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మదర్ అండ్ బేబి ట్రాక్ విధానాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో తొలి సారిగా విశాఖ కేంద్రంగా మెడికల్ టూరిజం సేవలు అమృత వేలీని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న మెడ్‌టెక్ జోన్‌లో తొలి దశ పనులు పూర్తియియ్యాని, జోన్‌లో తొలి సారిగా డయాలసిస్ మిషన్లుతో పాటు, కేథ్ ల్యాబ్ పరికరాలను తయారు చేస్తున్నామన్నారు.
దేశంలోనే ఏపీ మాతృ మరణాల నివారణలో నాలుగో స్థానంలో ఉందని ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. మాతృమరణాల సంఖ్య మన రాష్ట్రంలో గతంలో 92 శాతం ఉండేదని, ప్రస్తుతం 72 శాతానికి తగ్గిందన్నారు. ఈ విషయంలో నీతి ఆయోగ్ కూడా ఇటీవలే ఆరోగ్య శాఖని ప్రశంసించిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా బోధనాస్పుత్రులు, పాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ, ఐపీ సేవలు 30 శాతం పెరిగాయని, ఎన్టీ ఆర్ వైద్య సేవ పథకం ద్వారా గతంలో కంటే 27 శాతం అధికంగా మెరుగైన వైద్య సేవలందిస్తున్నామన్నారు. బోధనాస్పుత్రులకు పూర్తి స్థాయిలో వౌలికవసతులు కల్పించేందుకు రూ.160 కోట్లు మంజూరు చేసిందన్నారు. విమ్స్‌కు త్వరలోనే శాశ్వత పద్ధతిలో పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విమ్స్‌ను ప్రైవేట్ పరం చేయడంలేదని, పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పరుస్తూ స్పెషాలిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.