రాష్ట్రీయం

2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 24: బీజేపీ 2019 ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో పూర్తి ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రా ల్లో ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలకు దీటుగా బీజేపీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించారని, కర్నాటక ఫలితాలతో కాంగ్రెస్ ఓటమి వైపునకు దూసుకెళ్తోందని, దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బలమైన స్థానాలు లేవని అన్నారు. దేశ భద్రత, సంస్కృతిని వ్యతిరేకించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని మండిపడ్డారు. జమ్మూలో సైపుద్దీన్‌సోజ్, గులాంనబీ ఆజాద్‌లు ఉగ్రవాదులు, వేర్పాటువాదులు భాషను మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు అటు దేశ సమగ్రత, ఇటు సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో బీజేపీ ఎవరికీ తలొగ్గదని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం వేర్పాటువాదులతో అంటకాగడం సరికాదని అన్నారు. 2019 ఎన్నికల్లో వేర్పాటువాదంను సమర్థించే విషయాన్ని చర్చనీయాంశంగా మార్చుతామని తెలిపారు. కాంగ్రెస్ వైఖరి మారకపోతే కర్నాటకలాగే, దేశమంతటా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్ కూడా బీజేపీని ఓడించాలని కర్నాటకలో ప్రచారం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి టీఆర్‌ఎస్ జేబు సంస్థగా పనిచేస్తోందని, టీఆర్‌ఎస్‌ను సమర్థిస్తే కాంగ్రెస్‌ను సమర్దించినట్లేనని అన్నారు. అటు చంద్రబాబు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌ను అవమానించేలా రాహుల్‌గాంధీని కలిసాడని దుయ్యబట్టారు. ఆంధ్ర అవసరాలను జీరో చేసిన వ్యక్తి చంద్రబాబు అని, కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలపడం ఆంధ్ర ప్రజలను అవమానించడమేనని అన్నారు. ఇకపోతే రాష్ట్రం లో దేశంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ నడిపిస్తోందని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై త్వరలోనే చార్జిషీట్ తయారుచేసి ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు దారిమళ్లించి దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా గ్రామగ్రామాన ప్రచారం చేస్తామని మురళీధర్‌రావు అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఓదెలు, హరికుమార్‌గౌడ్, సాయికృష్ణారెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పొల్సాని మురళీధర్‌రావు