రాష్ట్రీయం

మరో 9నెలలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: టీఆర్‌ఎస్ సర్కారు మరో తొమ్మిది నెలలే అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆ తర్వాత తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశానికి ఉత్తమ్‌తోపాటు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరై ప్రసంగించారు. సాధారణ, మధ్యతరగతి ప్రజలు అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉత్తమ్ అన్నారు. కూలీనాలీ చేసుకొని దాచుకున్న సోమ్ము తిరిగి రాదని తెలిసి ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని అన్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పేదవారి గోడు వినేందుకు ఇష్టపడరని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటుండగా, తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని దుయ్యబట్టారు. నాలుగు లక్షల మందికి సంబంధించిన సమస్య పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విచారకరమని అన్నారు. ధైర్యం కోల్పోకుండా నిర్భయంగా ఉండాలని బాధితులకు ఉత్తమ్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

చిత్రం..పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి