ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంతో చంద్రబాబు రాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఓటుకు నోటు స్కాం నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారని, అందుకే కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జి శ్రీకాంతరెడ్డి, సీనియర్ నేత పార్ధసారథి, ఎమ్మెల్సీ కె వీరభద్ర స్వామి ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వరుసగా మూడు బడ్జెట్లలో ఆంధ్రాకు తీరని ద్రోహం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు వౌనంగా ఉంటున్నారన్నారు. సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు బడ్జెట్ బాగుందనడం, వెంకయ్య నాయుడు భలే బాగుందనడం చూస్తుంటే, వీరికి రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదా అని ప్రశ్నించారు.
మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, అవినీతి సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రివర్గంలో టిడిపికి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారని, వారిచేత రాజీనామా చేయించాలన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, భారీగా నిధులు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు కొల్లగొట్టిన టిడిపి-బిజెపి కూటమి ఈరోజు కేంద్రం పాదాల వద్ద చంద్రబాబు సాగిలపడ్డారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్లు ఇస్తే ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ గురించి చంద్రబాబు కేంద్రం వద్ద గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారన్నారు.
రాష్ట్రంలో పర్యటనలకు వచ్చినప్పుడు వెంకయ్య, చంద్రబాబును విపరీతంగా పొగడటంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు వీరి ప్రకటనలు చూసి అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రజా తీర్పును గౌరవించడమంటే ఇదేనా అని వారు ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో ఇంత అవమానం జరిగితే ఒత్తిడి తెస్తామని టిడిపి మంత్రులు ప్రకటించడం దారుణమన్నారు. చంద్రబాబు నిస్సహాయ స్థితి, చేతకానితనానికి నిదర్శనమన్నారు. 2018 లోపల పోలవరం ప్రాజెక్టును వందకోట్ల రూపాయలతో ఎలా పూర్తి చేస్తారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పోరాడుదామన్నారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలకు ఎర వేసి డబ్బు ఆశ చూపి చేర్చుకోవడం కంటే, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు అండ చూసుకుని నారా లోకేష్ మాఫియాను నడుపుతున్నారన్నారు.