ఆంధ్రప్రదేశ్‌

2020 వరకు ఐఓటి హబ్‌గా ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఎపిఐఓటి) పాలసీ 2016-20 కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియచేసింది. బుధవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించిందని ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2020 వరకు ఎపిని ఐఓటి హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఐఓటి పాలసీని మంత్రివర్గ సమావేశం ఆమోదించిందన్నారు.
ఈ విధానంలో ఐఓటి కంపెనీలను, సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థలకు వివిధ రూపాల్లో చేయూత ఇవ్వాలన్నది ఈ విధానంలో ప్రధానమైన అంశం. ఐఓటి కంపెనీలకు అవసరమైన భూమిని ఎపిఐఐసి కేటాయిస్తుందని వివరించారు. నిబంధనల మేరకు విద్యుత్ చార్జీలో రాయితీ ఇస్తామని, స్టాంప్ డ్యూటీ, వ్యాట్/సిఎస్‌టి, లీజ్ రెంటల్, క్వాలిటీ సర్ట్ఫికేషన్ తదితరాలన్నీ కొత్తగా ఏర్పాటయ్యే ఐఓటి కంపెనీకి తిరిగి చెల్లిస్తామని వివరించారు. పెట్టుబడిలో ప్రభు త్వం సబ్సిడీతో పాటు వడ్డీ రిబేటు ఇ స్తుందని వివరించారు. నైపుణ్యత అప్‌గ్రేడ్ చేసుకునేందుకు, శిక్షణ కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. ఆస్తిపన్ను, బీమాప్రీమియం తదితరాలన్నీ తిరిగి చెల్లిస్తామని ఐఓటి విధానంలో స్పష్టం చేశారు. ఐఓటి ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని, ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. మానవ వనరులకు సంబంధించిన ప్రతి అంశంపై సహకారం అందిస్తామని వెల్లడించారు.
ఐఓటి కంపెనీలకు ఈ విధానంలో కొన్ని షరతులను ప్రభుత్వం విధించింది. ఒక ఎకరాభూమిని ఐఓటి కంపెనీకి కేటాయిస్తే 250 మందికి ఉపాధి లభించేలా చూడాలని పేర్కొన్నారు. ఉద్యోగం లభించే వారిలో 50 శాతం మంది ఏపికి చెందిన వారై ఉండాలని, ఏపిలోనే జన్మించిన వారై ఉండాలని షరతు విధించారు. భూమి కేటాయించిన మూడు సంవత్సరాల్లో ఐఓటి కంపెనీ పనిచేయడం ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఐఓటి కంపెనీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ఈ రంగంలో కనీసం ఒక ఏడాది పాటు అనుభవం ఉండాలని, కనీసం రెండేళ్ల నుండి ఐటి రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉండాలని సూచించారు. ఐఓటి కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి కన్సల్టెటివ్ కమిటీ ఆన్ ఐటి ఇండస్ట్రీ (సిసిఐటిఐ) సిఫార్సు మేరకే భూమి కేటాయిస్తామన్నారు. ఐఓటి హబ్స్ ప్రైవేట్ సంస్థలు తమ సొంత నిధులతో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ సంస్థలు మూడు షిప్ట్‌లలో పనిచేసేందుకు అనుమతి ఇస్తామని, మహిళా ఉద్యోగులు కూడా మూడుషిఫ్టుల్లో పనిచేసేందుకు అనుమతిస్తామని ఈ విధానంలో స్పష్టం చేశారు.