ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమి కమిటీలకు చిన్ననీటి వనరుల పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ‘నీరు-చెట్టు’ కార్యక్రమం కింద చిన్న నీటి వనరుల్లో (కుంటలు, చెరువులు) ఇసుక తొలిగించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో 10 లక్షల రూపాయలలోపు పనులను నీటి వినియోగదారుల సంఘాలు లేదా జన్మభూమి- మావూరు కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇసుక తొలిగింపులో 10 లక్షల పైగా వ్యయం అయ్యే పనులను ఇ-టెండర్ విధానంలో అప్పగించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రిషితేశ్వరి కేసులో
ప్రిన్సిపాల్ అరెస్ట్
గుంటూరు (లీగల్), మార్చి 2: సంచలనం రేకెత్తించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బి ఆర్క్ విద్యార్థిని ఎం రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో కీలక నిందితుడుగా పేర్కొంటున్న ఆ కళాశాల ప్రిన్సిపాల్ గూడవల్లి బాబూరావును బుధవారం గుంటూరు జిల్లా, పెదకాకాని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ కేసులో విద్యార్థులు దుంపా హనీషాష, నరాల శ్రీనివాస్, ధారావత్ జయచరణ్‌లతో పాటు ప్రిన్సిపాల్ బాబూరావును కూడా నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పరారీలో ఉన్న బాబూరావును పోలీసులు అరెస్ట్‌చేసి గుంటూరు ఆరవ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎదుట హాజరుపర్చగా ఈ నెల 16వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ ఆదేశించారు. కాగా విద్యార్థులు ముగ్గురూ ఇప్పటికే బెయిల్ పొందారు.

ఏపి ప్రభుత్వ పాఠశాలల్లో
వృత్తివిద్యాకోర్సులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తివిద్యాకోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ వేసవి నుండే వీటిని ప్రవేశపెట్టి శిక్షణ అందించాలని భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహాయంతో మొదటివిడతలో ఎంపిక చేసిన 20 ఆదర్శపాఠశాలల్లో వీటిని ప్రారంభిస్తారు. ఐటి, బ్యూటీ అండ్ వెల్‌నెస్, ట్రావెల్ అండ్ టూరిజం, ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, రిటైల్ అండ్ సెక్యూరిటీ కోర్సులను ప్రయోగాత్మకంగా తొమ్మిదో తరగతి విద్యార్ధులకు బోధిస్తారు. తర్వాత పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ కోర్సులను బోధిస్తారు. విద్యార్ధులందరికీ ఈ ఏడాది నుండి ఐటి కోర్సును తప్పనిసరి చేయనున్నారు. ఆరు కోర్సుల్లో ఏదో ఒక కోర్సును విద్యార్ధులు ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కోర్సులు వేసవి శిక్షణకు పరిమితం అయినా, రానున్న విద్యాసంవత్సరంలో రెగ్యులర్ కోర్సులుగా బోధిస్తారు. మరోవైపు ఈ కోర్సులను బోధించే సంస్థలు, ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తోంది. సిఎస్‌ఇ డాట్ ఎపి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చని అధికారులు తెలిపారు.