ఆంధ్రప్రదేశ్‌

గీతం విసిగా ప్రొఫెసర్ ఎమ్మెస్ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గీతం విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతిగా డాక్టర్ మువ్వల సన్ని ప్రసాదరావు(ఎమ్మెస్‌ప్రసాద్) నియమితులయ్యారు. ఆయన గురువారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్వతీపురంలో జన్మించిన ప్రొఫెసర్ ప్రసాదరావు ఆంధ్రా యూనివర్శిటీ నుండి పిహెచ్.డి పొందారు. మూడేళ్లు రిజిస్ట్రార్‌గా కూడా పనిచేశారు, కుప్పంలోని ద్రావిడ వర్శిటీ, నిజామాబాద్ తెలంగాణ వర్శిటీ విచారణ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. ఎయులో పలు హోదాల్లో పనిచేసిన ప్రసాదరావు ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెషలిస్టుగా పరిశోధనలు కొనసాగించారు. అనేక గ్రంథాలను రాశారు. భారతదేశంలోనే తొలిసారిగా 1985లో ఈ సబ్జెక్టును ప్రవేశపెట్టినపుడు పాఠ్యాంశాల రూపకల్పన, ప్రగతిలో క్రియాశీల పాత్ర పోషించారు. ప్రసాదరావు నియామకంపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరావు, టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ సంజయ్, హెచ్‌బిఎస్ డీన్ ప్రొఫెసర్ ఎస్ ఎస్ ప్రసాదరావు, రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్‌ఆర్ వర్మ అభినందనలు తెలిపారు.

ఆంధ్రలో మార్చి 8 నుండి
ఒంటిపూట బడులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 2: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 8వ తేదీ నుండి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ కె. సంధ్యారాణి ప్రొసీడింగ్స్ 2 ద్వారా ఆర్‌జెడిలకు, డిఇఓలకు ఆదేశాలు జారీ చేశారు. వేసవి ముందుగానే ప్రవేశించినందున విద్యార్ధుల, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేయడం జరిగిందని, వారం రోజులు ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని నిర్ణయించడం సరైన నిర్ణయమని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డి హర్షం వ్యక్తం చేశారు.