ఆంధ్రప్రదేశ్‌

విష ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అవినీతిలో కూరుకుపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు, అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు ఈ దఫా భూదందా పేరిట మరో విషప్రచారం సాగిస్తున్నదంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత భూములిస్తున్న రైతులను రెచ్చగొట్టారు... గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేశారు... పంటలను తగులబెట్టించారు... ఏ పన్నాగమూ విజయవంతం కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వేల ఎకరాలు కొన్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ మీడియా వాస్తవాలను వక్రీకరిస్తూ అడ్డగోలు రాతలు రాస్తున్నదని, ఇక ప్రభుత్వపరంగా చర్యలు కూడా అలాగే ఉండగలవని అన్నారు.
అటాచ్‌మెంట్‌లో ఉన్న హాయ్‌లాండ్ భూమిని ఎలా కొట్టేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 4, సబ్‌సెక్షన్ 1 ప్రకారం మిగిలిన అగ్రిగోల్డ్ ఫామ్స్ అండ్ ఎస్టేట్ ఇండియా ప్రైయివేట్ లిమిటెడ్ ఆస్తుల పాటుగా హాయ్‌లాండ్‌ను కూడా జప్తు చేస్తూ గత నెల 20వ తేదీ జీవో జారీ చేయడం జరిగిందన్నారు. మొత్తం 16 వేల 857 ఎకరాలను జప్తు చేయటం జరిగిందని, అందులో గుంటూరు జిల్లాలో జప్తు చేసిన 103 ఎకరాలలో చినకాకానిలో 85.13 ఎకరాల హాయ్‌లాండ్ కూడా ఉందన్నారు. అలాగే కర్నూలులో 1285, అనంతపురంలో 1633, కడపలో 883, చిత్తూరులో 3312, ప్రకాశంలో 6339, కృష్ణాలో 2037, ప.గోలో 9ఎకరాలు, విశాఖలో 485, విజయనగరంలో 112, శ్రీకాకుళం 46 ఎకరాలను జప్తు చేయడం జరిగిందన్నారు. అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులపై యాజమాన్య హక్కులు అగ్రిగోల్డ్‌కే ఉంటాయని, అయితే సదరు భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లవన్నారు. రిజిస్ట్రేషన్ జరిగినా చెల్లదన్నారు. అలాంటిది హాయ్‌లాండ్ చిన బాబు లోకేష్ వశమయినట్లుగా జగన్ మీడియా ప్రచారం చేయడం దారుణమన్నారు.
మురళీమోహన్ రియల్ భేరీ
మురళీమోహన్ రియల్ భేరీ 212 కోట్ల విలువైన 53 ఎకరాలు కొనుగోలు చేసిందంటూ వక్రీకరించారు. అయితే వాస్తవానికి కుంచనపల్లిలో కేవలం 7 ఎకరాల విస్తీర్ణంలో జాయింట్ వెంచర్‌గా రెసిడెన్షియల్ ప్లాట్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నట్లు మురళీమోహన్ చెప్పారని గుర్తు చేశారు. తెలుగుదేశం అధికారం లోకి రావడానికి ముందే జరిగిన ఒప్పందం ఇదని అన్నారు. విమానాశ్రయ అధికారుల నుంచి ఇంకా చాలా అనుమతులు రావల్సి ఉండగా అప్పుడే ఎన్నారైలకు సగం ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకున్నట్లుగా కట్టుకథ అల్లారన్నారు. గతంలోనే ఓ సందర్భంలో అక్రమాలు రుజువు చేస్తే అసెంబ్లీ చెట్టుకు ఉరి వేసుకుంటానని మురళీమోహన్ సవాల్ చేయగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కేసును ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు.
బాలకృష్ణ వియ్యంకుడికి 430 ఎకరాలు
కృష్ణా జిల్లా జయంతిపురంలో 2007లోనే బాలకృష్ణ వియ్యంకుడు 430 ఎకరాలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. విబిసి కంపెనీ పెట్టుబడి రూ.7500 కోట్లు, ప్రత్యక్ష ఉపాధి 2700 మంది. 2007 డిసెంబర్ 20న కేంద్రం నుంచి అనుమతి లభించింది. హైదరాబాద్ సమ్మిట్‌లో 2012లో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎమ్‌వోయు చేసుకుంది. 2012 జూలై 7న ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఎకరాకు లక్ష రూపాయల రేటును నిర్ణయించింది నాటి ప్రభుత్వమేనని, అయితే కేవలం భూమిని ఎపిఐఐసికి బదలాయిస్తూ మాత్రమే తమ ప్రభుత్వం జీవో నెం.269 ఇచ్చిందన్నారు.
పయ్యావుల కేసులో భూములు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి బహిరంగంగా రాజధాని ప్రకటించిన తర్వాతే తన కొడుకు పేరిట 4 ఎకరాల భూమిని కొన్నానని కేశవులు స్వయంగా ప్రకటించారు. దీనిపై జగన్‌తో చర్చకు సిద్ధం కాగలరా అని చంద్రబాబు సవాల్ చేశారు. చివరగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయడానికి, రాజధాని ప్రాంత ప్రజలను మానసికంగా కుంగదీయడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలను జనం అసహ్యించుకుంటున్నారని అన్నారు. కుల రాజకీయాలతో రాష్ట్రంలో హింసకు తెరదీశారు. అయితే ఈ అసాంఘిక శక్తులను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలదన్నారు.

చిత్రం... విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు