ఆంధ్రప్రదేశ్‌

ఆశా వర్కర్ల ఆందోళన భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రూ.400 - 500లకే ఊడిగం చేస్తున్న 45వేల మంది ‘ఆశా కార్యకర్తలకు’ గత 16నెలలుగా ఆ కొద్దిపాటి జీతం కూడా రాకపోవడాన్ని నిరసిస్తూ సిఐటియు అనుబంధ సంస్థ ఎపి వలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ శుక్రవారం చేబట్టిన చలో విజయవాడ ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప, కర్నూలు తదితర జిల్లాల్లో విజయవాడకు బయలుదేరుతున్న వందలాది మంది వర్కర్స్‌ను రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలోనే అరెస్టు చేశారు. అయినప్పటికీ ధైర్యంగా పోలీసుల ఆటంకాలను అధిగమించి విజయవాడ చేరుకున్న మరో 300 మందిని అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర 2గంటల పాటు నిర్బంధించి ఆ తర్వాత అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన మరో 500 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తోపులాటలు చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తంపై 1200 మందిని అరెస్టు చేసి జిల్లాలోని 8పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో ఎమ్మెల్సీలు ఎంవిఎస్ శర్మ, గేయానంద్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.పుణ్యవతి, ఎపి వలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.్ధనలక్ష్మి, ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కమల, సిపియం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబూరావు తదితరులున్నారు. ఈ అక్రమ అరెస్టులను నిరశిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మండల, పట్టణ కేంద్రాలలో నిరశన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా నాయకులు పిలుపిచ్చారు. ఇదిలా ఉండగా నేడు జరిగే ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తూ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా ముందుగానే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇలాంటి ఉత్తర్వుల జారీ పట్ల నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి కింద నెలకు 2వేలు చెల్లిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు కనీసం చెల్లించే రూ.500 కూడా ఏ నెలకానెల చెల్లించడానికి మనసు రావటం లేదన్నారు.

ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు