రాష్ట్రీయం

జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధి లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకే కోర్టులు మొట్టికాయలు వేశాయని ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. అయితే ఎవరో కోర్టులో కేసు వేస్తే, ప్రభుత్వం తరపున సరిగ్గా వాదనలు వినిపించకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇదంతా కాంగ్రెస్ వల్లే జరిగిదంటూ విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బోగస్ మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టంపైన చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు హాజరుకాకుండా మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ చర్చ జరిగి ఉంటే ప్రతిపక్షాల నుంచి మంచి సలహాలు, సూచనలు వచ్చేవని వ్యాఖ్యానించారు. బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లపై చర్చించాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేతకానితనం వల్లే కోర్టులు చీవాట్లు వేస్తున్నాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.