రాష్ట్రీయం

ఎందరో వాసుబాబులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: ఎమ్సెట్ పేపర్ లీక్ వ్యవహారంలో సిఐడీ అధికారులు తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. లీక్ వ్యవహారంలో వాసుబాబులు చాలా మంది ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేగాక, వాసుబాబు 2016 పేపర్‌తో పాటు అంతకు ముందు జరిగిన ఎమ్సెట్ పేపర్లను సైతం లీక్ చేశారా అనే అంశాన్ని కూడా విచారిస్తున్నారు. 2016లోనే పేపర్ లీక్ కేసు చేపట్టిన అప్పటి డిఎస్పీ బాలుదేవ్, హెడ్ కానిస్టేబుల్ సదాశివరావులు సైతం కొన్ని ఆధారాలను నాశనం చేయడమేగాక, నిందితులకు పట్టుకోకుండా వారికి ఊతం ఇచ్చిన అంశంపై కూడా తాజాగా మరోసారి అధికారులు విచారిస్తున్నారు.
2016 కంటే ముందు కూడా పేపర్ లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తం కావడంతో ఎలాంటి ఆధారాలు లేకపోయినా, 2012 తర్వాత జరిగిన నాలుగు ఎమ్సెట్‌లలో అనుమానిత విద్యార్ధులను ప్రశ్నించడం ద్వారా లీక్ వ్యవహారాన్ని నిర్ధారించాలని పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. మరో పక్క కన్వీనర్ పాత్ర, ఎమ్సెట్ కమిటీ పాత్రను మరింత లోతుగా విచారణ జరపాలని చూస్తోంది. 2016లో పేపర్‌లీక్‌తో ప్రయోజనం పొందిన వారి సంఖ్య ఇంకా తేలలేదు. శ్రీ చైతన్య డీన్ వేలేటి వాసుబాబు, కమ్మ వెంకట శివ నారాయణ పాత్ర చాలా విస్తృతంగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఒక కిలో నూనె కొనుగోలు చేయాలన్నా యాజమాన్యం అనుమతి అవసరమైన చైతన్య విద్యాసంస్థల్లో ఇంత పెద్ద కుంభకోణం యాజమాన్యానికి తెలియకుండా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2016 ఎమ్సెట్-1 పరీక్ష జూలై 9వ తేదీన జరగ్గా వాటి ఫలితాలను జూలై 14న ప్రకటించారు. ఫలితాలు రాగానే కొంత మంది అభ్యర్ధులకు వచ్చిన ర్యాంకులను చూసిన తల్లిదండ్రులు అనుమానించి ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రికి, ఉన్నత విద్యామండలికి, ఎమ్సెట్ కన్వీనర్‌కు, ఎమ్సెట్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే వీరంతా అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేసినా, అంతర్గతంగా జరిగిన పరిశీలనలో ర్యాంకులపై అనుమానాలు రావడంతో జూలై 25న కేసు రిజిస్టర్ చేశారు. లీక్‌కు సంబంధించి కొంత మంది వ్యక్తులను గుర్తించినా, వారిని అరెస్టు చేయకుండా వారితో చేతులు కలిపినందుకు అప్పటి ఎసీబీ డీఎస్పీ బాలు జాదవ్‌ను నగర కమిషనర్ సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు హెడ్ కానిస్టేబుల్ సదాశివరావును కూడా సస్పెండ్ చేశారు. తొలుత వరంగల్, విజయవాడ, ఆదిలాబాద్‌లో విద్యార్ధులను ప్రశ్నించడంతో తీగ లాగితే డొంక కదిలినట్టు దేశంలో వివిధ ప్రాంతాల్లో వారు పరీక్షలకు ముందు వారం పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందిన విషయం వెలుగుచూసింది. ముకుల్ జైన్ ఢిల్లీ క్యాంప్ వ్యవహారం, ధర్మ అలియాస్ ధరం అలియాస్ పాజీ ఆధ్వర్యంలో కొల్‌కటా క్యాంప్, శనిక్యం రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బెంగలూరు క్యాంప్, గుడిపల్లి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కొల్‌కటా రెండో క్యాంప్, జ్యోతిబాబు ఆధ్వర్యంలో బెంగళూరు కేంప్, డాక్టర్ కోటా గంగాధరరెడ్డి ఆధ్వర్యంలో షిర్డీ క్యాంప్, వెంకటదాస్ ఆధ్వర్యంలో కొల్‌కటా క్యాంప్, నిషాద్, మాయాంక్ సింగ్ ఆధ్వర్యంలోని ముంబై క్యాంప్, షేక్ రహీం ఆధ్వర్యంలో పూనే క్యాంప్ వ్యవహారాలు వెలుగు చూశాయి. వీరిని ప్రశ్నించుకుంటూ రావడంతో తేనెతుట్టు కదిలింది. గోవర్ ప్రెస్ నుండి అక్కడ పనిచేసే రాం వీర్ సింగ్ అలియాస్ రావత్ ఎమ్సెట్-2 రెండు సెట్ల పేపర్లను శైలేష్ సింగ్‌కు అందజేశాడని తేలింది. శైలేష్ సింగ్ శివబాహుదూర్ సింగ్‌కు బంధువు, అనుచరుడు కూడా. కొన్ని సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలకు చెందిన ప్రశ్నాపత్రాల లీక్ కేసుల్లో నిందితుడిగా ఉన్న శివ్ బాహుదూర్ సింగ్ ఆ ప్రశ్నాపత్రాన్ని అనూప్‌కుమార్ సింగ్‌కు అందజేసినట్టు పోలీసులు అంచనాకు వస్తున్నారు. అక్కడి నుండి అది రూపేష్‌కు, నౌషద్‌కు, హర్యానాకు హతిన్ తహసీల్ నటోలి గ్రామస్తుడు మహ్మద్ ఇక్బాల్ ఖాన్ అలియాస్ ఖాన్(29)కు చేరింది. మరో పక్క గుంటూరులో ఇండో గ్లోబల్ మెడ్ ఎడ్యుకేర్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన గుమ్మడి వెంకటేష్‌కు, బీహార్‌కు చెందిన న్యాయవాది కమలేష్‌కుమార్ సింగ్‌కు చేరింది. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న రాం వీర్ సింగ్ సెప్టెంబర్ 2016న గుండెపోటుతో మరణించగా, కమలేష్ కుమార్ సింగ్ 2017 జనవరి 6న ఉస్మానియా ఆస్పత్రిలో మరణించాడు. విద్యార్ధులు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులు, సమాచారం మేరకు సిఐడి కొల్లి రాజశేఖర్ కుమార్ అలియాస్ రాజేష్‌ను, చింతపల్లి జానయ్య అలియాస్ జాన్సన్‌ను, రిజనన్స్ మెడికల్ అకాడమికి చెందిన అరిగి వెంటరామయ్య అలియాస్ వెంకటరమణ, బండారు రవీంద్ర అలియాస్ బి రవిని ప్రశ్నించారు. అలాగే ఢిల్లీలో మెడికల్ కన్సల్టెంట్ మొహిత్ కుమార్ సింగ్ , ఉషా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీకి చెందిన శనిక్యం రాజగోపాల్‌రెడ్డి అలియాస్ గోవింద్‌రెడ్డి, ధనుంజయ్, తాకీర్, సందీప్‌కుమార్, గుడిపల్లి చంద్రశేఖరరెడ్డి, షేక్ షకీర, రాజవర్మ, సంజయ్‌కుమార్ ప్రభాత్, వెంకటరావు, భూపాల్‌రెడ్డి పరకాల, శృతి కేష్‌కుమార్, అజయ్‌కుమార్ సిన్హా, రాజేష్‌కుమార్, డాక్టర్ కో గంగాధరరెడ్డి, పల్లం వెంకటరావు, జె రామకోటేశ్వరరావు, మహ్మద్ అబ్దుల్ రహ్మన్, ఖాజా మొయిజుద్దీన్, శ్యాం యాదవ్, అతిమాముల రామకృష్ణ , అరుణ్ రాజ్‌లను సిఐడి ప్రశ్నించి కొంత మందిని అరెస్టు చేసింది. వారిలో ఇపుడు కొంత మంది బెయిల్‌పై ఉన్నారు. ఈ మొత్తం కేసులో ఒకొక్కరినీ ప్రశ్నిస్తుంటే విచారణ అధికారులకు కొత్త విషయాలు తెలియడంతో దర్యాప్తు దీర్ఘకాలంగా కొనసాగుతోంది.