తెలంగాణ

నీటి ప్రాజెక్టులపై ‘సమన్వయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలో కీలకమైన 46 నీటి ప్రాజెక్టులను సత్వరమే అమలు చేసే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమన్వయ కమిటీ ఆవిర్భావానికి, భేటీకి తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవే కారణంగా నిలిచింది. దేశవ్యాప్తంగా నీటి ప్రాజెక్టుల అనుమతుల సాధనలో జరుగుతున్న జాప్యం, ఫలితంగా జరుగుతున్న నష్టంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు విడమరచి చెప్పడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ వాదనకు విలువిచ్చి సమన్వయ కమిటీ భేటీని కేంద్రం నిర్వహించడం విశేషం. కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఒక్కో ప్రాజెక్టు నిర్మాణానికి రెండు మూడు దశాబ్దాల సమయం ఎందుకు పడుతుంది? దీని వల్ల జరుగుతున్న నష్టం ఏమిటి? సత్వర అనుమతుల కోసం ఏంచేయాలి? అనే కీలక నిర్ణయాల కోసం కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ కీలక సమావేశం శనివారం దిల్లీలో జరుగుతుంది. ఈ కమిటీ ఏర్పాటు ఆవశ్యకతను కేంద్రానికి వివరించిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దిల్లీలో శనివారం జరిగే సమన్వయ కమిటీ భేటీలో కీలక పాత్ర వహించనున్నారు. ప్రధానమంత్రి కృషి సచ్ఛాయ్ యోజన (పిఎంకెఎస్‌వై) కింద దేశంలో మొత్తం 46 ప్రాజెక్టుల నిర్మాణం సత్వరం పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికి అనుసరించాల్సిన కార్యాచరణపై శనివారం నాటి సమన్వయ కమిటీ సమావేశాలో నిర్ణయం తీసుకుంటారు. దీనితోపాటు ప్రాజెక్టుల ఆలస్యానికి కారణాలపై చర్చించి, సత్వరం పూర్తి చేయడానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తారు.
టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మొట్టమొదట ప్రాజెక్టులపైనే దృష్టిసారించింది. తాత్కాలిక ఉపశమన చర్యలు ఎన్ని తీసుకున్నా శాశ్వత పరిష్కారం మాత్రం భారీనీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణమే అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టుల అనుమతుల కోసం కేంద్రం నుంచి జరుగుతున్న జాప్యం వల్ల దేశానికి ఎంత నష్టం కలుగుతుందో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇటీవల దిల్లీలో జరిగిన సమావేశంలో వివరించారు. హరీశ్‌రావు వెల్లడించిన అంశాలతో ఏకీభవించిన కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి ఉమాభారతి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖ మంత్రి బ్రిజ్‌మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మహారాష్ట్ర జలవనరుల శాఖ గిరీష్ దత్తాత్రేయ మహాజన్‌లు ఈ సమన్వయ కమిటీలో సభ్యులు.
దేశవ్యాప్తంగా సత్వరం పూర్తి చేసేందుకు 46 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, సత్వర అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం, సిడబ్ల్యుసి పనితీరు మెరుగు పరచడం, ప్రాజెక్టులకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించడం, కేంద్ర జలవనరుల శాఖ సామర్ధ్యం పెంచడంతో పాటు పలు అంశాలపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసేందుకు సమన్వయ కమిటీ సమావేశం అవుతుంది. ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యతను నిత్యం పర్యవేక్షించడం వంటి అంశాల్లో సమన్వయ కమిటీ కేంద్రానికి సూచనలు చేయనుంది. వచ్చే ఏడాదికి 23 ప్రాజెక్టులు, 2020 నాటికి మొత్తం 46 ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ఈ పథకం కింద తెలంగాణలోని దేవాదులను ఎంపిక చేశారు. మరో ప్రాజెక్టును చేర్చాలని కేంద్రాన్ని హరీశ్‌రావు కోరారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టుకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎఐబిపి కింద దేవాదుల ప్రాజెక్టుకు రావలసిన నిధులు రెండేళ్ల నుంచి రావడం లేదని, తక్షణం నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. శనివారం జరిగే సమావేశంలో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.