రాష్ట్రీయం

విషవాయువు మింగేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి: ఉక్కు కర్మాగారంలో విషవాయువులీక్ కావడంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని గెర్డౌ ఉక్కు పరిశ్రమలో గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఆరుగురు కార్మికులు టనె్నల్‌లోనే మృతి చెందడం గమనార్హం. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం మోగకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో మనోజ్‌కుమార్(24), రంగనాథ్(21), గంగాధర్(37), వసీంబాషా(39), లింగయ్య(26), గురువయ్య(40) ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రి మండలంలోని గెర్డౌ ఉక్కు పరిశ్రమలోని కార్బన్ మోనాక్సైడ్ టనె్నల్ లోపల గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇద్దరు కాంట్ట్రాక్టు కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. పనులు చేస్తుండగా కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ కావడంతో వారిద్దరూ ఊపిరాడక అపస్మారకస్థితికి చేరుకున్నారు. ఇది గమనించిన సూపర్‌వైజర్ ప్రమోద్ ఆచారి వారిని బయటకు తీసుకువచ్చేందుకు మరో నలుగురిని లోపలికి పంపారు. వారు సైతం విషవాయువును పీల్చడంతో అపస్మారకస్థితికి చేరుకుని లోపలే పడిపోయారు. ఆరుగురు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సూపర్‌వైజర్ ప్రమోద్ ఆచారి, మరో ఉద్యోగి రంగనాథ్ ఏమైందోనని తొంగిచూడగా వారు సైతం అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలియగానే తోటి కార్మికులు వెంటనే యాజమాన్యం దృష్టికి జరిగిన సంఘటనను తీసుకువెళ్లారు. వెంటనే గ్యాస్ లీకేజీని అరికట్టి అస్వస్థతకు గురైన కార్మికులను తాడిపత్రిలోని ఓ ప్రైవేటు
ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన సూపర్‌వైజర్ ప్రమోద్ ఆచారి, ఉద్యోగి రంగనాథ్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రి రూరల్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ గురువారం రాత్రి సంఘటనాస్థలాన్ని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు.
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం..
గెర్డౌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఆరుగురు కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయని బంధువులు ఆరోపించారు. టనె్నల్‌లో గ్యాస్ లీకైనప్పుడు అలారం మోగేలా ఏర్పాటుచేశారు. అయితే గురువారం కార్మికులు టనె్నల్ లోపల మరమ్మతులు చేస్తుండగానే గ్యాస్ లీకైంది. అయితే అలారం మోగకపోవడంతో గ్యాస్ లీకైనట్లు కార్మికులు గుర్తించలేకపోయారు. దీంతో తొలుత ఇద్దరు మృత్యువాత పడ్డారు. వారిని బయటకు తెచ్చే క్రమంలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా 3200 ఆర్‌పీఎం కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులు కాగా ఒకరు కంపెనీ ఉద్యోగి, మరొకరి అప్రెంటిష్ కార్మికుడు. అనంతపురం జిల్లాకు చెందిన మనోజ్‌కుమార్, రంగనాథ్, గంగాధర్, కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన వసీంబాషా, కడప జిల్లా మంగపట్నంకు చెందిన లింగయ్య, ప్రకాశం జిల్లా రాళ్ళపల్లికి చెందిన గురువయ్య మృత్యువాతపడ్డారు. మృతుల బంధువుల ఆర్తనాదాలతో తాడిపత్రి ఆసుపత్రి దద్దరిల్లింది. ముందుజాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను తాడిపత్రిలో మోహరించారు.
చిత్రం....తాడిపత్రి ఆసుపత్రి వద్ద గుమిగూడిన మృతుల బంధువులు, కార్మికులు

*ఇన్‌సెట్‌లో మనోజ్‌కుమార్ మృతదేహం వద్ద విలపిస్తున్న తండ్రి