రాష్ట్రీయం

అంగన్‌వాడీలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా అంగన్‌వాడీలు పని చేయాలని, అప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరి ప్రజలకు మేలు చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన అంగన్‌వాడీల అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి గర్భిణులకు సీమంతం నిర్వహించి వారికి పసుపు, కుంకుమ, గాజులు, చీరను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రాబోయే ఆగస్టు 15 తేదీ లోపు సెల్‌ఫోన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఒక అన్నగా అంగన్‌వాడీలకు అండగా ఉంటానని, రాష్ట్ర ప్రభుత్వ విజయం అందరి విజయమని తెలియచేస్తామని , మనందరి ఉద్దేశ్యం ప్రజలందరికీ మెరుగైన పాలన అందించడమేనన్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు వేతనాలు పెంచిన రోజు జూన్ 25న అంగన్‌వాడీలకు నిజమైన పండుగ అని తెలిపారు. రాష్ట్రంలో 257 ప్రాజెక్టులు, 55,607 సెంటర్ల ద్వారా లక్ష మంది అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు పని చేస్తున్నారని, 1600 మంది ఐసీడీఎస్‌లు, సీడీపీవోలు, ఏపీడీవోలు 400 మంది సిబ్బంది కలిసి 34 లక్షల మంది పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ. 4,200 నుంచి రూ. 7వేల తర్వాత ఇప్పుడు రూ. 10,500లకు వేతనాలు పెంచామన్నారు. అంగన్‌వాడీలు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తే శిశు మరణాలు తగ్గడంతోపాటు ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుందన్నారు. రూ.250 కోట్ల వ్యయంతో 6 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలు 14.90 లక్షల మందికి అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. బాల సంజీవని తదితరమైన కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు నువ్వులు, బెల్లం, గోరుముద్దలు తదితరమైన పౌష్టికాహారానికి రూ. 365 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఆడబిడ్డల అవసరాలను గుర్తించి తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, బేబికేర్ కిట్స్, మాస్టర్ మహిళా హెల్త్ చెక్ అప్, శానిటరీ నాప్‌కిన్స్‌ని మహిళలకు అందిస్తున్నామన్నారు. మహిళలపై ఎక్కడైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు మహిళలంతా సంఘటితమై వాటిని
ఎదుర్కొవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, ఎఎస్ రామకృష్ణ, శ్రీనివాస్, ఎమ్మెల్యీలు బొండా ఉమామహేశ్వరరావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కే సునీత, కమిషనర్ అరుణ్‌కుమార్, మేయర్ కోనేరు శ్రీ్ధర్, కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ 2 పీ బాబూరావు, భారీసంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

చిత్రం..అంగన్‌వాడీల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు