రాష్ట్రీయం

హోదాపైనే తొలి సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 12: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలుపై ఉంటుందని రాష్ట్ర పిసిసి వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ తెలిపారు. గురువారం నెల్లూరులోని ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 5కోట్ల ఆంధ్ర ప్రజలను బీజేపీ, టీడీపీలు మోసం చేశారని తెలిపారు. పార్లమెంటులో చట్టం చేసిన ఏ అంశాన్ని కూడా బీజేపీ పార్టీ అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. అదే విధంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు బీజేపీ , తెలుగుదేశం పార్టీలు సహకరించకుండా బడా పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి మంజూరు చేసిన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయకుండా ఆంధ్ర ప్రజలను మోసం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన 58వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఇవ్వకుండా బీజేపీ తుతూ మంత్రంగా నిధులను మంజూరు చేసిందన్నారు. రాష్టన్రికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అన్నారు. ప్రధానమంత్రిగా రాహుల్‌గాంధీ ఖావడం ఖాయమని చెప్పారు.

చిత్రం..నెల్లూరులో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఊమెన్‌చాందీ