ఆంధ్రప్రదేశ్‌

కాపులను బీసీల్లో చేరుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట: కాపులకు న్యాయం చేస్తానని, బీసీల్లో చేరుస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కాపులకు ఒక్కశాతం కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదని అన్నారు. సమాజ హితం కోసం కల్యాణ మండపాన్ని నిర్మించడం శుభ పరిణామమన్నారు. తాను 211 రోజులు 2,510 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్ని కులాల వారి సమస్యలను అధ్యయనం చేశానని చెప్పారు. కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల రూపాయలను బడ్జెట్‌లో ఇవ్వనున్నామని తెలిపారు. జస్టిస్ మంజునాథ్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే కళాశాలల్లో కాపు విద్యార్థులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. పేదరికం లేని సమాజాన్ని ఆర్థిక అసమానతలను రూపుమాపి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానని ఈసందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. తనపై ఎన్నో విమర్శలు చేస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రతిపక్ష నాయకులపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి ఆగితే తనపై వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో ప్రతిపక్ష నాయకులు దురాలోచన చేస్తున్నారన్నారు. ‘ప్రతిఒక్కరూ చైతనైనంత సహకరించండి.. చేతకాకపోతే గమ్మున ఉండండ’ చంద్రబాబు సూచించారు. తాను జీవితంలో ఎప్పుడూ వెనుదిరిగిన సందర్భమే లేదన్నారు. తనవల్ల ఒక్కరికైనా మంచి జరిగి వారి జీవితంలో వెలుగులు నిండి, వారు గుర్తుంచుకుంటే తనకు చాలునన్నారు. రాష్ట్ర జనాభా ఆధారంగా అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి పత్తిపాటి పుల్లారావు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, కలెక్టర్ కాంతిలాల్‌దండే, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా కోటప్పకొండలో కాపు కల్యాణ మండపాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు