రాష్ట్రీయం

వచ్చేది మా ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీనేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్ నుంచి ఆయన ఫైస్‌బుక్ లైవ్ నిర్వహించి పార్టీ కార్యాకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే నవంబర్, డిసెంబర్‌లలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని ఉత్తమ్ అన్నారు. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం సాదించేలా కృషి చేయాలని ఉత్తమ్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వంద రోజల్లో, ఏకకాలంలో రైతలకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ప్రకటించారు. అతి ముఖ్యమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ కుటుంబంలో ఐదు ఉద్యోగాలు సంపాదించుకొన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలకు రైతులు గుర్తుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. వరికి
క్వింటాలుకు రెండు వేలు, పత్తికి ఆరు వేలు, మొక్కజొన్నలకు రెండు, మిర్చి, పసుపులకు పది వేలు చొప్పున మద్దతు ధర చెల్లిస్తామని చెప్పారు. వీటితో పాటు రైతుల కోసం పకడ్బందీగా పంట బీమాను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్ చేపట్టబోయే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా విజయాలకు బాటలు వేయాలని కార్యకర్తలను కోరారు.
‘పంచాయతీ’ల పాపం సర్కారుదే
ఇక పంచాయతీ ఎన్నికల పాపం ప్రభుత్వానిదేనని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసిందని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో సర్కారు చేసిన తప్పిదాలతో న్యాయస్థానాలో ఎదురు దెబ్బ తగిలిందని, దానిని కాంగ్రెస్ పార్టీపై మోపుతోందని దుయ్యబట్టారు.