రాష్ట్రీయం

తెలంగాణపై నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: తెలంగాణలో ఆధిపత్యాన్ని సంపాదించడంతోపాటు, సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు అమిత్ షా నేరుగా పాట్నా నుండి హైదరాబాద్ వస్తారు. అనంతరం ఆయన 5వేల మంది కార్యకర్తల బైక్‌ర్యాలీ మధ్య పార్టీ కార్యాలయానికి 11 గంటలకు చేరుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఆయన తిరిగి బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. ఉదయం పార్టీ కార్యాలయంలో 14 మంది కోర్ కమిటీ సభ్యులతో భేటీ అవుతారు. దేశవ్యాప్తంగా కనీసం 350 లోక్‌సభ నియోజకవర్గాలను గెలుచుకునే లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ నేతలు దక్షిణాదిన 120 నియోజకవర్గాలపై కనే్నశారు. వాటిలో కనీసం 14 నియోజకవర్గాలను తెలంగాణ నుండి గెలవాలనే లక్ష్యంతో అమిత్‌షా తన ప్రణాళికను రూపొందించారు. ఖమ్మం, పెద్దపల్లి, హైదరాబాద్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 14 నియోజకవర్గాలను గెలవాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. ఈసారి తెలంగాణ నుండి అత్యధిక సీట్లను సాధించుకునే వీలుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలపై బీజేపీ గురిపెట్టింది. వీటి పరిధిలో 98 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికార పీఠం అధిరోహించడంతో పాటు బీజేపీకి అత్యధిక పార్లమెంటు స్థానాలను అందించాలనే అమిత్‌షా వ్యూహంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. శుక్రవారం నాటి భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, పి మురళీధర్‌రావు, జి కిషన్‌రెడ్డి, ఎన్ రామచందర్‌రావు, బండారు దత్తాత్రేయ, పేరాల చంద్రశేఖరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, బద్దం బాల్‌రెడ్డి పాల్గొంటారు. కోర్ కమిటీ భేటీ అనంతరం అమిత్ షా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నలుగురితో పాటు చర్చిస్తారు. అమిత్ షా వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి
భూపేందర్ యాదవ్, జాయింట్ జనరల్ సెక్రటరీ సౌధాన్ సింగ్ వస్తారు. ఆయనతో పాటు మరో ఇద్దరు జాతీయ నాయకులు ఈ మేధోమథనంలో పాల్గొంటారు. అసెంబ్లీ ఇన్‌చార్జిలు, ఎన్నికల సన్నాహక కమిటీ నేతలు వివిధ నియోజకవర్గాల స్థితిగతులను వివరిస్తారు.
విజయబావుటా ఎగురవేస్తాం: డాక్టర్ కే లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళిక అమలుచేస్తామని, విజయ బావుటా ఎగురవేస్తామని డాక్టర్ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. అమిత్ షా రాక సందర్భంగా సీనియర్ నేతలతో భేటీ అయిన లక్ష్మణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ అవినీతి వెలుగుచూస్తోందని అన్నారు. కుటుంబ పాలనకే టీఆర్‌ఎస్ నేతలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మరో పక్క సంతుష్టీకరణ విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని అన్నారు. అదే విధంగా, ఈసారి అసెంబ్లీ, పార్లమెంటు కేంద్రంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పారు. రోజరోజుకూ రాష్ట్రంలో ఆదరణ పెరుగుతోందని, ఊహించని విధంగా పార్టీకి బలం పెరిగిందని పేర్కొన్నారు. ప్రజలు ముందస్తు ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని, ఎంత తొందరగా ఎన్నికలు వస్తే అంత తొందరగా టీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ విస్తరణకు చర్యలను సూచించడంతో పాటు మోదీ విధానాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా అమిత్ షా సూచనలు ఇవ్వనున్నారని లక్ష్మణ్ అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించిందని వాటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ నిర్వాకం వల్ల కేంద్రం 1.23 లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చినా, 1300 కోట్ల రూపాయిలు కేటాయించినా, ఇంత వరకూ 15 నుంచి 20వేల ఇళ్లను మాత్రమే నిర్మించిందని దీనివల్ల పేదలు నష్టపోయారని అన్నారు.
రామోజీతో చర్చలు
అమిత్ షా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ నేతలతోనూ, పత్రికాధిపతి రామోజీతోనూ చర్చించనున్నట్టు తెలిసింది. అయితే పార్టీ నేతలు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.