ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 12: ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో శుక్రవారం అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఒడిశాను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం యథావిధిగా కొనసాగుతోంది. దీంతోపాటు, శుక్ర లేదా శనివారాల్లో ఒడిశాకు సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు.దీనివల్ల రుతుపవనాలు మరింత బలపడి, భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. వాతావరణ శాఖ సూచనలతో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎటువంటి సహాయక చర్యలకైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.