రాష్ట్రీయం

15,661 విద్యావలంటీర్ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో 15,661 విద్యావలంటర్లీ పోస్టులను మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు టి విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తెలుగు బోధనకే 1161 మందిని కేటాయించగా, మిగిలిన అంశాల బోధనకు 14500 మందిని కేటాయించారు. 31 జిల్లాల్లో భర్తీ చేయాల్సిన విద్యావాలంటీర్ల వివరాలను
డీఈఓలకు పంపించారు. ఈ ప్రక్రియను 20వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ 627, వనపర్తి 212, నాగర్‌కర్నూలు 633, జోగులాంబ గద్వాల్ జిల్లాకు 803, రంగారెడ్డి 528, మేడ్చెల్ 107, వికారాబాద్ 1312, హైదరాబాద్ 801, మెదక్ 780, సంగారెడ్డి 1293, సిద్దిపేట 480, నిజామాబాద్ 442, కామారెడ్డి 701, ఆదిలాబాద్ 420, నిర్మల్ 510, కుమరంభీం ఆసిఫాబాద్ 1265, మంచిర్యాల 279, కరీంనగర్ 139, రాజన్న సిరిసిల్ల 146, జగిత్యాల 276, పెద్దపల్లి 108, వరంగల్ అర్బన్ 94, వరంగల్ రూరల్ 44, జనగామ 120, జయశంకర్ భూపాలపల్లి 931, మహబూబాబాద్ 340, ఖమ్మం 471, భద్రాద్రి కొత్తగూడెం 701, నల్గోండ 596, సూర్యాపేట 301, యాదాద్రి భువనగిరి 201 పోస్టులు భర్తీ చేస్తారు.