రాష్ట్రీయం

ఎన్నిసార్లు చెప్పాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: ‘భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాసు పుస్తకాలు ఇచ్చాం. రైతుబంధు పథకం కింద చెక్కులు ఇచ్చాం. కొందరు రైతులకు అవి ఇంకా అందలేదు. కొన్ని పాసు పుస్తకాల్లో తప్పులు సవరించాల్సి ఉంది. పేరు మార్పిడీలు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ త్వరతగతిన పూర్తి చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసినా వేగంగా పనులు జరగడం లేదు’అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావురెవిన్యూశాఖపై అంసతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని, ముందు రికార్డులన్నింటినీ మాన్యువల్‌గా సరి చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం రైతు బీమా పథకం, భూ రికార్డులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ, ఆర్థికశాఖ కార్శదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, సీఎంఓ అధికారులతో కేసీఆర్ చర్చించారు. రైతులందరికీ రైతుబంధు జీవిత బీమా వర్తింప చేయాలని ఆయన స్పష్టం చేశారు. రైతుల అందరి పేర్లు నమోదు
చేసుకోవడంతో పాటు నామినీల దరఖాస్తులు స్వీకరించే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని ఆయన సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులు సవరించడంతో పాటు పేరు మార్పు తదితర కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైతు బీమా పథకం కింద రైతుకు ఎన్ని చోట్ల భూములున్నా, ఎన్ని ఖాతాలున్నా ఒక రైతుకు ఒకటే పాలసీ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. పేద, ధనిక అనే తేడా లేకుండా 18-60 సంవత్సరాల వయసున్న ప్రతి రైతు పేరు నమోదు చేయాలని అధికారులుకు సూచించారు. నామినీల దరఖాస్తు ఫారాలు తొందరగా ఇచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటి వరకు అందిన వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తే, మొదటి విడత బీమా ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం చెప్పారు.

చిత్రం..రైతుబంధు, రైతు బీమాపై ప్రగతి భవన్‌లో అధికారులతో
సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్