రాష్ట్రీయం

ఇక రైతులకు బర్రెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: పాడి పరిశ్రమ సహకార సంఘాలకు చెందిన పాడి రైతులకు సబ్సిడీపై బర్రెలు కొనుగోలు చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని పాడి పరిశ్రమాభివృద్ధిశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా పాడి పరిశ్రమ సహకార సంఘాలలో 2.13 లక్షల మంది పాడి రైతులు ఉన్నారని ఆయన వివరించారు. పాడి రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయాలని ఆదేశించారు. ఒక్కో యూనిట్‌కు రూ. 80 వేలు, రవాణా చార్జీల కింద మరో రూ. 5 వేలు మొత్తంగా రూ.85 వేలు కేటాయించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పాడి రైతులకు 75 శాతం సబ్సిడీ, ఇతర వర్గాలకు చెందిన రైతులకు 50 శాతం సబ్సిడీపై బర్రెలు పంపిణీ చేయాలని ఆదేశించారు. బర్రెలను ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా కొనుగోలు చేసే అవకాశాన్ని రైతులకు కల్పించాలని చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.