రాష్ట్రీయం

పోర్టులకు ఇక మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 13: నౌకాశ్రయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్టు కేంద్ర నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు, నీటిపారుదల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలియచేశారు. దేశంలోని 12 మేజర్ పోర్టుల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లతో గడ్కరీ గత రెండు రోజులుగా విశాఖలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒక్కో పోర్టుపై రెండు నుంచి మూడు గంటలపాటు చర్చించిన మంత్రి వాటి వివరాలను శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలియచేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నాకాశ్రయాల శాఖ మూడు వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని, అది ఇప్పుడు ఏడు వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. పోర్టుల ద్వారా ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆక్వా ఎగుమతికి పెద్ద పీట వేయనున్నామన్నారు. ఇందుకోసం అన్ని పోర్టుల్లోను స్పెషల్ ఎకనమిక్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నామని గడ్కరీ వివరించారు. జవహర్‌లాల్ నెహ్రూ పోర్టులో ఇప్పటికే వెయ్యి కోట్లతో స్పెషల్ ఎకనమిక్ జోన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.
దేశంలోని మేజర్ పోర్టులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కాండ్లా పోర్టులో 15 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ పోర్టులోనే కేంద్ర విద్యుత్‌శాఖ నిధులతో కొత్తగా 2000 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం యూనిట్ 11 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని, సోలార్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే, యూనిట్ 2.40 రూపాయలకు లభిస్తుందని అన్నారు. టుటికోరిన్, కాండ్లా, పారాదీప్ పోర్టుల్లో డీసాలినేషన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఉప్పు నీటిని తాగు నీటిగా మార్చి, లీటరు మూడు పైసలకే స్థానిక సంస్థలకు విక్రయించనున్నట్టు గడ్కరీ చెప్పారు. దేశంలోని అన్ని పోర్టుల్లో సరుకు రవాణాకు వ్యాగన్ల కొరత తీవ్రంగా ఉందని గడ్కరీ చెప్పారు. కార్గోను వేగంగా తరలించేందుకు గూడ్స్ రైళ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. దీనివలన తక్కువ ఖర్చుతో ఎరువులను రవాణా చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
సాగరమాల ప్రాజెక్ట్ కింద దేశంలోని వివిధ పోర్టుల్లో 16 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గడ్కరీ చెప్పారు. మొదటి దశలో 8.07 లక్షలో కోట్లతో 576 ప్రాజెక్ట్‌లను చేపట్టామన్నారు. పోర్టుల్లో యాంత్రీకరణ, ఆధునీకరణ పనులు చేపట్టనున్నామని ఆయన చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం 4.7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని అన్నారు. పోర్టు కనెక్టివిటీకి 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలియచేశారు. కోస్టల్ కనెక్టివిటీకి 7.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. వీటిలో 13,500 కోట్ల విలువైన 69 ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే పూర్తి చేశామని ఆయన చెప్పారు. సాగరమాల ద్వారా కోటి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. ప్రతి పోర్టులోను కంటైనర్ స్కానర్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోర్టులను తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. మేజర్ పోర్టుల్లో మిగులు నిధులతో ఆయా పోర్టుల్లో వౌలిక సదుపాయాలు కల్పించడానికి ఖర్చు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ముంబైలోని ఎయిర్ ఇండియా భవనాన్ని పోర్టు మంత్రిత్వ శాఖ కొనుగోలుచేయనుందని గడ్కరీ చెప్పారు. పోర్టు లాభాల నుంచి లాభాల నుంచి పోర్టు ఉద్యోగులకు పింఛన్లు చెల్లించనున్నామని ఆయన తెలియచేశారు. ప్రతి పోర్టు పెర్ఫార్మెన్స్ ఆడిట్ చేసుకోవాలని సూచించినట్టు ఆయన చెప్పారు. పోర్టుల అభివృద్ధిలవో చెన్నై ఐఐటీ సలహాలు తీసుకోనున్నామని అన్నారు. నౌకల మరమ్మతుల సౌకర్యం కొన్ని పోర్టుల్లో ఉన్నాయని, వీటిని మరిన్ని పోర్టుల్లో ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. ఏపీలో కొత్త పోర్టు ఏర్పాటుకు 3000 ఎకరాల భూమి కావాలని సీఎంను కోరనున్నట్టు గడ్కరీ తెలియచేశారు. సాగరమాల కింద వచ్చే కొన్ని ప్రాజెక్ట్‌లను ఈ పోర్టులో ఏర్పాటు చేయనున్నామని అన్నారు. పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టూరిజంకు కావల్సిన కేటర్‌మిరన్స్ కొనుగోలు చేసి మరమ్మతు చేసి నడపాలని నిర్ణయించాం. ముంబై పోర్టులో ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి తొలి క్రూయిజ్ నౌక జలప్రవేశం చేయబోతోందని ఆయన చెప్పారు. కృష్ణా నదిలో కూడా క్రూయిజ్ టూరిజంకు అనుమతులు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ముంబై పోర్టులో క్రూయిజ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు గడ్కరీ చెప్పారు. ప్రతి మేజర్ పోర్టులో కూడా క్రూయిజ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ప్రతి పోర్టులో ఎరువులు, ఎల్‌పీజీ కోసం ప్రత్యేక బెర్త్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. ముంబైలో పోర్టులో ఫ్లోటింగ్ రెస్టారెంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖలో కూడా ఇటువంటిది ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రతీ పోర్టులోను సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించామని ఆయన చెప్పారు. విశాఖ పోర్టులో ఫ్రీ ట్రేడ్ జోన్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు గడ్కరీ చెప్పారు. అలాగే విశాఖలో శాటిలైట్ పోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో చర్చించాలని పోర్టు చైర్మన్‌కు సూచించామని అన్నారు. విశాఖ-పారాదీప్ పోర్టుల మధ్య పార్షియల్ కార్గో డిస్‌చార్జ్ పోర్టును ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆటోమొబైల్ వేస్ట్‌ను కాండ్లాకు తరలించి, దాంతో ఆటోమొబైల్ రంగానికి కావల్సిన విడి భాగాలను తక్కువ ధరకు తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని మంత్రి గడ్కరీ తెలియచేశారు.
విలేఖరుల సమావేశంలో పోర్టుల శాఖ సహాయ మంత్రులు రాధాకృష్ణన్, మన్‌సుఖ్ మాండవీయ, విశాఖ పోర్టు చైర్మన్ కృష్ణబాబు పాల్గొన్నారు.

చిత్రం..విశాఖలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి గడ్కరీ