రాష్ట్రీయం

ప్రతిష్ట పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అద్భుత ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ నగరాల సదస్సుతో అమరావతి బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఆర్‌డీఏ అధికారులతో ప్రపంచ నగరాల సదస్సు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, తదితరు అంశాలపై ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సింగపూర్‌లో జరిగిన సదస్సులో అమరావతి ఆర్థిక కేంద్రంగా మారనున్న విషయాన్ని సమర్థవంతంగా చెప్పగలిగామన్నారు. ప్రపంచ నగరాల సదస్సులో అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు హామీ ఇచ్చిన మేరకు పెట్టుబడులు వచ్చేందుకు నిరంతర పర్యవేక్షణకు సమర్థవంతమైన అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనివల్ల మెగా ప్రాజెక్టుల అమల్లో ఎదురయ్యే ఇబ్బందులు సులువుగా పరిష్కరించవచ్చన్నారు. ఇదే సమయంలో అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఐటీ, ఆర్థికాభివృద్ధి బోర్డు, ఇతర విభాగాలను భాగస్వాములను చేయాలన్నారు. అమరావతి నిర్మాణంలో స్పష్టమైన, నిర్దిష్ట కార్యాచరణ ఉండాలన్నారు. అప్పుడే భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించగలుతామని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతి కొత్త తరం రాజధాని
నగరం అంటూ 165 నగరాల మేయర్లు కొనియాడారన్నారు. పునరుత్పాదక ఇంధనం, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి నిర్వహణ, ఇంధన సామర్థ్యం, ఎలక్ట్రిక్ వాహనాలు, రవాణా, తదితర అంశాల్లో ఇతర నగరాలకు అమరావతి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భూసమీకరణ పథకం, గ్రీన్‌ఫీల్డ్ సిటీ మాస్టర్ ప్లాన్, ప్రభుత్వ భవనాలకు ఉత్తమ ఆకృతులు వంటివి అద్భుతంగా ఉన్నాయనే ప్రశంసలు లభించాయన్నారు. అమరావతిలో అంతర్జాతీయ పెట్టుబడుల ఫలితాలు ప్రతి ప్రాంతానికీ అందాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16.04 లక్షల కోట్ల రూపాయల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని చరిత్ర సృష్టించామని గుర్తుచేశారు. అంతర్జాతీయ వేదికలపై పెట్టుబడిదారులకు మనం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలన్నారు ఇప్పటికే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో వ్యవస్థను అమలు చేస్తున్నామని, దీనివల్ల సులభతర వ్యాపార నిర్వహణలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని గుర్తుచేశారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. ఇక్కడి అన్నదాతల త్యాగాలను ప్రపంచ నగరాల సదస్సు కొనియాడిందని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అశాస్ర్తియంగా విభజించినప్పటికీ ప్రజల అండతో సింగపూర్‌ను మించి అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తనకుందన్నారు. అతి తక్కువ వడ్డీరేట్లను గుర్తించే విషయమై అంతర్జాతీయ బ్యాంకింగ్ పరిస్థితులపై అధ్యయనం చేయాలని సీఆర్‌డీఏ, ఇంధన శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈసందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సంతోష నగరాల సదస్సులో చేసిన ఆరు తీర్మానాలు అన్ని నగరాలకు లబ్ధి చేకూరుస్తాయని అన్నారు. 165 నగరాల ప్రతినిధులను ఈసారి నిర్వహించనున్న సంతోష నగరాల సదస్సుకు ఆహ్వానించాలని అధికారులకు ఆయన సూచించారు.