రాష్ట్రీయం

గెలుపు మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలంతా ఐక్యతతో పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చి న సోనియాగాంధీకి తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి కృతజ్ఞత చాటాలన్నారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమీక్షా స మావేశానికి సలీమ్ అహ్మద్ హాజరై అసెం బ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, శక్తియాప్ నమోదులను సమీక్షించి పార్టీ పరిస్థితులపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. సమావేశం ప్రారంభం సందర్భంగా సలీమ్ అహ్మద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రధాని మోదీ నల్లధనం వెలికితీసి దేశ ప్రజల ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున వేస్తానని, రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని అధి కారంలోకి వచ్చారనీ, దళిత ముఖ్యమం త్రి, దళితులకు మూడెకరాల భూమి, ఎస్టీ లు, మైనార్టీలకు రిజర్వేషన్ల కల్పన, కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తానంటూ సీఎం కేసీఆర్ అధికారాన్ని కైవసం చేసు కున్నారన్నారు. ఎన్నికల్లో చెప్పిన హామీలను అమలు చేయడంలో వీరిద్దరూ విఫలమై పాలించే అర్హత కోల్పోయారన్నారు. మాయమాటలతో బీజేపీ, టీఆర్‌ఎస్ ప్ర భుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయ ని, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని
అహ్మద్ విమర్శించారు. కోమటిరెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాల రద్దు, నల్లగొండ కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య, ఫిరాయింపులతో టిఆర్‌ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. బీజేపీతో టీఆర్‌ఎస్ రహస్య ఒప్పందాలతో ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతోందని, ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో సీఎం కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సాగిస్తున్న పోరాటాలను కాంగ్రెస్ కార్యకర్తలు మరింత ఉద్ధృతం చేయాలన్నారు. ఈనెల 30లోగా బూత్ నుండి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని, వచ్చే నెలలో నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపడుతామన్నారు. శక్తియాప్‌లో ప్రతి కార్యకర్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ క్యాడర్ ఉత్సాహం చూస్తే జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్న నమ్మకం కలుగుతోందని, ఐక్యంగా పనిచేస్తే ఇది అసాధ్యం కాదని అన్నారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవడం ద్వారా రాష్ట్రానికి, దేశానికి మార్గదర్శిగా నిలువబోతోందన్నారు. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో దేశంలోనే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేత చర్యల్లో కార్యకర్తలంతా భాగస్వామ్యం కావాలన్నారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలకు విరుద్ధంగా అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అప్రజాస్వామిక, దుష్టపాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే నల్లగొండ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఐదు లక్షలకుపైగా మెజార్టీతో గెలవబోతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌కు జైలుగతి తప్పదన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్‌కు నల్లగొండ జిల్లా నాయకత్వం వహిస్తోందన్నారు. మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్లుగానే కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా సాగి నల్లగొండ లోక్‌సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డికి డిపాజిట్ సైతం దక్కనివ్వబోమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మాజీ ఎమ్మెల్యేలు భారతీ రాగ్యానాయక్, చిరుమర్తి లింగయ్య, పీసీసీ కార్యదర్శులు, నియోజకవర్గాల నాయకులు వేణుగోపాల్, ప్రేమ్‌లాల్, వినోద్‌రెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సంకు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ సమావేశంలో
మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్