రాష్ట్రీయం

మెడికల్ కౌనె్సలింగ్‌ను వెంటనే నిలిపివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబర్ 550పై హైకోర్టు స్టే విధించినందున మెడికల్ కౌన్సిలింగ్ వెంటనే నిలిపివేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన వర్గాలకు లబ్దిచేకూర్చే విధంగా ఉన్న జీఓపై హైకోర్టు స్టే విధించడం వల్ల ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. గత 17 సంత్సరాలుగా కొనసాగుతున్న స్లైడింగ్ విధానాన్ని ఎత్తివేశారు. వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు సీట్లు లభించడం లేదు. ఓపెన్ కాంపిటేషన్‌లో వచ్చిన వారిని సైతం ఆప్షన్స్ పేరుతో రిజర్వేషన్ కోటాలో సీట్లు కేటాయిస్తున్నారని వివరించారు. బీసీ సంక్షేమ సంఘం ఎన్నో పోరాటాల అనంతరం ఈ జీఓ వచ్చింద మంత్రికి తెలిపారు. ఈ జీఓపై హైకోర్టు, సుప్రీం కోర్టులలో చాలా కేసులు నడిచాయని, చివరకు బీసీ సంక్షేమ సంఘం కోర్టులో గెలిచిన తరువాత ఈ జీఓ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీఓపై స్టే విధించిన సమయంలో మెడికల్ సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించి సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన కడియం స్టే తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.