రాష్ట్రీయం

214వ రోజు కొనసాగిన జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపూడి, జులై 17: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర 214వ రోజైన మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. ఉదయం 8.30గంటలకు అనపర్తి నియోజకవర్గంలోని కరకుదురు నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఆచ్యుతాపురత్రయం, రామేశ్వరం మీదుగా కొనసాగింది. పాదయాత్ర భారీ జనసందోహం మధ్య ఉత్సాహభరితంగా సాగింది. మహిళలు భారీ సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిలుచుని జగన్‌మోహనరెడ్డికి స్వాగతం పలికారు. కరకుదురు ఎంపీటీసీ సభ్యుడు ఉండ్రు చంద్రకళ, సత్యనారాయణ దంపతులు తమ కుమారుడు ప్రణవ్ సూర్యతేజకు జగన్‌మోహనరెడ్డి చేత అక్షరాభ్యాసం చేయించారు. పలువురు వృద్ధులు, వికలాంగులు తమకు పింఛన్లు అందడం లేదని జగన్‌కు మొరపెట్టుకున్నారు. కాకినాడకు చెందిన మహేశ్వరి అనే విద్యార్థిని ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడంలేదని ఫిర్యాదుచేసింది. ఏపిత్రయంలో భారీగా తరలివచ్చిన అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రామేశ్వరం చేరుకున్న జగన్ భోజన విరామానంతరం రామేశ్వరం రైల్వే గేటు మీదుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ గ్రామంలోకి ప్రవేశించారు. అక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గ నేతలు ఘన స్వాగతం పలికారు. వైసీపీ అనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి జగన్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.