రాష్ట్రీయం

పరిపూర్ణానంద దేశ ద్రోహం చేశారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి దేశద్రోహం చేశారా అని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వామిని నగర బహిష్కరణ ఎందుకు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపూర్ణానంద అరెస్టుపై చినజీయర్ స్వామి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. పరిపూర్ణానందను, సినీ రచయిత కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేస్తే గవర్నర్ నరసింహన్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. స్వాములపై గూండా చట్టం కింద కేసు పెట్టినా పట్టించుకోరా? అని గవర్నర్‌ను ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును కలవడానికి క్యాంపు ఆఫీసుకు వెళ్ళాలనుకుంటే పోలీసులు ఎక్కడికక్కడ వారిని గృహ నిర్భంధం చేశారని ఆయన తెలిపారు. శాంతిభద్రతల పేరిట ఎవరిని పడితే వారిని పోలీసులు అరెస్టు చేయడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ అన్ని పార్టీలూ చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన సూచించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి ముఖ్యమంత్రిని, దుర్మార్గపు పాలనను చూడలేదన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన నగర కాంగ్రెస్ సమావేశం నుంచి తాను వాకౌట్ చేయలేదని, మరో సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళాలని ఆయన వివరించారు. పార్టీ అధిష్టానం సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా తాను మద్దతు ఇస్తానని విహెచ్ తెలిపారు.

తెలంగాణలో రావణ రాజ్యం
తాజా పరిణామాలపై బీజేపీ నేత కృష్ణదాస్
హైదరాబాద్, జూలై 17: తెలంగాణలో రావణరాజ్యం వెలిసిందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి పీకే కృష్ణదాస్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆయన పలు ట్వీట్‌లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీరు చూస్తుంటే రావణరాజ్యంలో ఉన్నట్టుందని, తెలంగాణలో రాముడి గురించి ఎవరు మాట్లాడినా, అరెస్టు చేస్తారు, వారిని శిక్షిస్తారు అన్నట్టు ప్రభుత్వ తీరు ఉందని ఆయన ట్వీట్ చేశారు. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ తగదని, ఆయనపై విధించిన బహిష్కరణ వేటును తొలగించాలని పేర్కొంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని నగరంలో ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడం చాలా దారుణమని కృష్ణదాస్ పేర్కొన్నారు. ఇది అధికారాన్ని దుర్వినియోగం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని ఆయన చెప్పారు.