రాష్ట్రీయం

దర్శనాల ‘రద్దు’పై పునఃసమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 17: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు జరుగనున్న అష్టదిగ్బంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకూడదనే దర్శనాల రద్దుపై ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని టీటీడీ పాలక మండలి ప్రకటించింది. ఈ నెల 24 తేదీన ఈ విధానంపై పూర్తి స్థాయి పునస్సమీక్షించి దర్శనంపై విధి విధానాలను ఖరారుచేసే విషయమై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని పునః సమీక్షిస్తున్నామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ ఏకే సింఘాల్ వెల్లడించారు. రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న శ్రీవారి దర్శనాల రద్దు అంశంపై సీఎం ఆదేశాలతో మంగళవారం టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్‌యాదవ్, ఈఓ ఏకే సింఘాల్, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ భక్తులకు శ్రీవారి దర్శనం లేకుండా చేయాలన్నది టీటీడీ అభిమతంకాదన్నారు. మహాసంప్రోక్షణ జరిగే సమయాల్లో మూడు నాలుగురోజులు సెలవుదినాలు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు రోజుకు లక్ష మంది ఉండే అవకాశం ఉంటుందన్నారు. అందరికీ దర్శనాలు కల్పించడం సాధ్యంకాదన్నది అక్కడ సహజ పరిస్థితులను బట్టి ఎవరికైనా అర్థమవుతుందన్నారు. మహా సంప్రోక్షణం జరిగే రోజుల్లో రోజుకు రెండు మూడు గంటల సమయం మాత్రమే భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రోజుకు లక్షమంది భక్తులు వస్తే వారు స్వామి దర్శనం కోసం నిరీక్షించాల్సిన సమయం గణనీయంగా పెరుగుతుందన్నది అక్షర సత్యం అన్నారు. అటుతరువాత రోజురోజుకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ముందురోజు తిరుమలలో ఉన్న భక్తులతో చేరినపుడు రెండురోజుల్లో రెండు లక్షలు అవుతారన్నారు. అలా రోజురోజుకీ భక్తుల సంఖ్య ముందురోజు భక్తులతో కలిసి పెరుగుతూ ఉంటుందన్నారు. రోజుకు పరిమిత సంఖ్యలో దర్శనం కల్పించే అవకాశం ఉన్నప్పుడు తక్కిన వారు ఎన్ని ఇబ్బందులు పడతారో అధ్యయనం చేశామన్నారు. ఈక్రమంలోనే 6 రోజుల పాటు భక్తులను అనుమతించకూడదనే ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనాల రద్దుపై పునస్సమీక్షిస్తున్నామన్నారు. ఈ వాస్తవాలను తెలిసినా కూడా కొంత మంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల దర్శనంపై అభిప్రాయాలు సేకరించి ఈనెల 24న దర్శన విధివిధానాలను నిర్ణయిస్తామన్నారు. మహాసంప్రోక్షణం అయిన 11వ తేదీన అంకురార్పణ జరుగుతుందని, ఆరోజున 9 గంటల సమయం ఉంటుందన్నారు. 12వ తేదీన 4 గంటల సమయం ఉంటుందన్నారు. 13వ తేదీన 4గంటలు, 14న 5 గంటలు, 15న 5 గంటలు, 16న 4 గంటల సమయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు.